Saturday, January 18, 2025
HomeTrending Newsకశ్మిరీల మనోభావాలు గౌరవించాలి - కాంగ్రెస్

కశ్మిరీల మనోభావాలు గౌరవించాలి – కాంగ్రెస్

జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్దరించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి చిదంబరం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 24 వ తేదీన కశ్మీర్ అఖిలపక్ష నేతలోతో జరిపే  సమావేశంలో రాష్ట్ర హోదా పై నిర్ణయం తీసుకోవాలని చిదంబరం కోరారు. అఖిలపక్ష సమావేశంలో 14 పార్టీల ప్రతినిధులు పాల్గొంటున్నందున ప్రజల మనోభావాలను గౌరవించాలని హితవు పలికారు.

కశ్మీర్ అంశంలో కేంద్ర ప్రభుత్వం రాజ్యంగ విరుద్దంగా వ్యవహరిస్తోందని చిదంబరం విమర్శించారు. కాశ్మీర్ లోయను రియల్ ఎస్టేట్ వ్యాపార కోణంలో కేంద్రం పరిగనిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల రాజ్యాంగబద్దమైన   హక్కుల్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆరోపించారు.

రాబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో జమ్మూ కశ్మీర్ కు  రాష్ట్ర హోదా కల్పించే బిల్లు ప్రవేశ పెట్టాలని చిదంబరం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.  బిల్లుకు కాంగ్రెస్ సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్