సినీ, రాజకీయ, సామాజిక విశ్లేషకుడు కత్తి మహేష్ మృతి చెందారు. చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొదుతున్న మహేష్ కాసేపటి క్రితం మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

జూన్ 26 న మహేష్ ప్రయాణిస్తున్న వాహనం నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని వేగంగా ఢీ కొట్టింది. మహేష్ వాహనం ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ఎయిర్‌ బ్యాగ్స్‌ తెరుచుకున్నా, తల భాగంలో మహేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కంటికి కూడా గాయమైంది. వెంటనే నెల్లూరు సమీపంలో ఉన్న మెడికవర్ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేయించారు. పరిస్థితి తీవ్రంగా ఉండడంతో అదేరోజు చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు. కత్తి మహేష్ వైద్య చికిత్స కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 17 లక్షల రూపాయల నిధులు కూడా మంజూరు చేసింది. సిఎం రిలీఫ్ ఫండ్ వ్యవహారాలు పర్యవేక్షించే డా. మామిడి హరికృష్ణ అపోలో ఆస్పత్రికి ఎల్వోసీ (లెటర్ అఫ్ కన్ఫర్మేషన్) పంపించారు.

వెంటిలేటర్ పై ఉంచి మహేష్ కు చికిత్స అందిస్తున్నారు, అయితే అయన ఆరోగ్య పరిస్థితిలో మార్పులేకపోగా, కొద్దిసేపటి క్రితం గుండెపోటుకు గురై మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *