కవ్వాల్ టైగర్ రిజర్వ్ లో గ్రామాల తరలింపు ప్రారంభం

కవ్వాల్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియాలో గ్రామాల తరలింపు ప్రక్రియ ప్రారంభం అయింది. స్వచ్చందంగా ముందుకు వచ్చిన మైసంపేట, రాంపూర్ వాసులు. నిర్మల్ జిల్లా కడెం మండలం కేంద్రంలో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిహార చెక్కులు, ఇండ్ల స్థలాలు, వ్యవసాయ భూముల పట్టాల పంపిణీ చేశారు. రెండు గ్రామాలకు చెందిన 142 కుటుంబాలకు 15 లక్షల రూపాయల చొప్పున పరిహార ప్యాకేజీ అందచేశారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖనాయక్, భైంసా ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, అటవీశాఖ ముఖ్యకార్యదర్శి శాంతికుమారి ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

వ‌న్య‌ప్రాణుల చ‌ట్టం -1972, పులుల సంరక్షణ అథారిటీ (NTCA)  మార్గ‌ద‌ర్శ‌కాల‌ ప్ర‌కారం తరలింపు ప్రక్రియను మంత్రి ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు, తెలంగాణ చరిత్రలో మొదటిసారి పులుల అభయారణ్యం నుంచి గ్రామాల తరలింపు ప్రక్రియ జరుగుతోందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. పులులు- వన్యప్రాణుల సంరక్షణ, ఆవాసాల అభివృద్దికి తెలంగాణ అటవీశాఖ ప్రాధాన్యత ఇస్తోందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు.

Also Read : పర్యాటకుల కోసం కవ్వాల్ వెబ్ సైట్  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *