Tuesday, April 16, 2024
HomeTrending Newsఅనితరసాధ్యుడు గులాబీ దండు అధినేత

అనితరసాధ్యుడు గులాబీ దండు అధినేత

దక్షిణాదిన ఎంతో మంది ఉద్దండ రాజకీయ నాయకులకు సాధ్యం కానిది…ఒక్క కేసీఆర్ కు మాత్రమే సాధ్యం కాబోతున్నది. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగిన నేత కెసిఆర్.

అవును తమిళనాడు ఆత్మగౌరవం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి వంటి నాయకులు తమ పార్టీ కార్యాలయాన్ని ఢిల్లీలో నిర్మించలేకపోయారు. ఇక కర్ణాటక రాజకీయాలలో చక్రం తిప్పి దేశ ప్రధానిగా కూడా సేవలందించిన దేవె గౌడ కూడా తమ పార్టీ కార్యాలయాన్ని దేశ రాజధానిలో నిర్మించలేకపోయారు. ఇక ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీకగా చెప్పుకునే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం సైతం ఢిల్లీలో నెలకొల్పలేకపోయారు.

పైన పేర్కొన్న నాయకులు ఒకరు తక్కువ కాదు మరొకరు ఎక్కువ కాదు. వారివారి పరిధిలో కేంద్ర ప్రభుత్వాన్ని నాటి ప్రధానులను గట్టిగా ఎదుర్కొన్నవారే సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించినవారే.

ప్రత్యేకించి కేసీఆర్ గురించి చర్చించుకోవాలి. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం విభిన్న పంథా ఎంచుకున్నారు. 543 సీట్లు కలిగిన లోక్ సభలో కేవలం ఇద్దరు ఎంపిలతోనే దాదాపు 36 పార్టీల మద్దతును తెలంగాణకు అనుకూలంగా కూడగట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాడు. నాడు కేసీఆర్ తెలంగాణ సాధిస్తాను అని గట్టిగా నమ్మిండు కాబట్టే పార్టీ పెట్టిండు….రాష్ట్రాన్ని సాధించిండు… తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు ఊహించని రీతిలో తక్కువ కాలంలోనే దేశం గర్వించేలా అభివృద్ధి చేసి చూపించిండు.

రాష్ట్రాన్ని సాధించి తొలుత తన పుట్టిన గడ్డ తెలంగాణ రుణం తీర్చుకున్నడు. ఇప్పుడు ఢిల్లీ వేదికగా తెలంగాణ అభివృద్ధిని యావత్ దేశానికి చేరేలా ముందుకు సాగుతున్నాడు.

దేశ రాజకీయాల్లో కేసీఆర్ ది ఓ విలక్షణ వైఖరి అనే కన్నా ఒక మాస్టర్ పీస్ అనే చెప్పుకోవాలి. అలాంటి నాయకుడు ప్రధాని అయితే దేశ సంపద అంబానీలకు ఆదానీలకు కాకుండా ప్రజలకు చెందుతుంది. రేపు సెప్టెంబర్ 2న దేశ రాజధానిలో తెరాస పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన… దేశ రాజకీయాల్లో నవ శకానికి అంకురార్పణ కానుందని గులాబీ దండు జోరు మీద ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్