Wait and See: రాబోయే దసరా నుంచి కేసిఆర్ కొత్త రాజకీయం మొదలవుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి వెల్లడించారు. కేసిఆర్ దేశ్ కీ నేత అని అయన ప్రధాని కావడం తథ్యమని జోస్యం చెప్పారు. హన్మకొండలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మల్లారెడ్డి భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వివిధ కార్ఈమిక సంఘాల నేతలు, కార్మికులతో  సమావేశమయ్యారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే దాస్యం విని భాస్కర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ  సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ దసరా రోజున సిఎం కేసిఆర్ కూడా భద్రకాళి అమ్మవారిని  దర్శించుకొని కార్యాచరణ మొదలు పెడతారని చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో బిజెపి అధికారంలో వచ్చే ప్రసక్తే లేదని, దివాళా తీయబోతోందని అన్నారు. కేసిఆర్ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పి, ఢిల్లీలో తప్పకుండా పాగా వేస్తారని ధీమా వ్యక్తం చేశారు. కార్మికుల పిల్లలు కూడా గొప్పవాళ్ళు కావాలంటే, పేదవారు కూడా ధనవంతులు కావాలంటే కేసిఆర్ నాయకత్వాన్ని బలపరచాలని పిలుపు ఇచ్చారు.

Also Read : పల్లెలపై మీ పెత్తనం ఏమిటి? కేంద్రంపై కేసిఆర్ ఫైర్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *