Sunday, June 7, 2026
HomeTrending Newsఢిల్లీ పయనమైన కెసిఆర్

ఢిల్లీ పయనమైన కెసిఆర్

తెలంగాణ సీఎం కెసిఆర్ ఈ రోజు సాయంత్రం (సోమవారం) హస్తినకు పయనమయ్యారు. రెండు  మూడు రోజుల పాటు సీఎం కేసీఆర్ ఢిల్లీలోనే ఉంటారు. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. సీఎం వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తో పాటు చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి  తదితరులున్నారు.

ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయమై పార్లమెంట్ లో  ఇప్పటికే తెరాస ఎంపీలు ఆందోళనలు చేస్తున్నారు. పార్లమెంట్ లో కేంద్రంపై పోరాటంలో ఇతర పార్టీలకు చెందిన ఎంపీల సహకారం తీసుకోనుంది.  ఇదే సమయంలో జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించాలని కూడా కేసీఆర్ భావిస్తున్నారు. ఈ తరుణంలో ఢిల్లీలో అందుబాటులో ఉండే  బీజేపీయేతర పార్టీలకు చెందిన నేతలతో కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయమై కేంద్ర మంత్రులతో కూడా కేసీఆర్ సమావేశం అయ్యే అవకాశం ఉందని సమాచారం.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపుతుందని  టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అప్పులు తీసుకొనే విషయంలో ఆంక్షలు విధించడాన్ని తప్పుబడుతున్నారు. మరో వైపు  రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్దిలో దూసుకు వెళ్తుంటే రాష్ట్రానికి ఆర్ధికంగా సహకారం అందించకుండా కేంద్రం అడ్డుపడుతుందని టీఆర్ఎస్ నేలు విమర్శలు చేస్తున్నారు.

మరో వైపు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగానే  దేశం ఇతర దేశాల కంటే వెనుకంజలో ఉందని కూడా కేసీఆర్ విమర్శలు చేస్తున్నారు. ప్రధాని మోడీ విధానాలతో దేశంలోని పలు రాష్ట్రాల్లో ఘర్షణలు చోటు చేసుకొంటున్నాయని కూడా టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular