Tuesday, February 25, 2025
HomeTrending Newsసాయన్న మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

సాయన్న మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న పార్థివ దేహానికి నివాళులర్పించిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు… సాయన్న కుటుంబ సభ్యులని ఓదార్చారు. వివిధ పదువుల ద్వారా సాయన్న చేసిన ప్రజాసేవ చిరస్మరణీయమని కేసీఆర్ కొనియాడారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సాయన్న ఆరుదైన ఘనత సాధించారని అన్నారు. సాయన్న కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

సాయన్న మృతికి ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ సంతాపం ప్రకటించారు. సాయన్న కంటోన్మెంట్‌ ప్రజల శ్రేయస్సు కోసం శ్రమించారని, ఆయన మృతి తీరని లోటన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. కాగా కంటోన్మెంట్ నుంచి సాయన్న ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ నుంచి నాలుగు సార్లు గెలవగా.. 2018లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. సాయన్న రెండేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్