Friday, April 19, 2024
HomeTrending Newsమాది న్యూట్రిషన్ పాలిటిక్స్ - మంత్రి హరీష్ రావు

మాది న్యూట్రిషన్ పాలిటిక్స్ – మంత్రి హరీష్ రావు

తెలంగాణ వస్తే నీళ్ళు వస్తాయి అన్నారు కెసిఆర్ ,ఇప్పుడు తెచ్చి చూపించారని మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ జిల్లా కొండ పోచమ్మ సాగర్ కాలువ ద్వారా గోదావరి నీటిని ఈ రోజు నిజాంపేట మండలం నార్లపూర్‌ కు విడుదల చేసిన మంత్రి హరీశ్ రావు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి,జిల్లా కలెక్టర్,స్థానిక నాయకులు పాల్గొన్నారు.

మంత్రి హరీశ్ రావు కామెంట్స్ :

ఇది ఒక కలలాగా ఉంది, కేవలం వర్షా కాలంలో మాత్రమే నీరు ఉంటుండే, ఇప్పుడు ఎండాకాలం కూడా నీళ్లు ఉంటున్నాయి. గతంలో ఒక బోరు పడితే అదృష్టం గా బావిస్తుండే, ఇప్పుడు నార్లపూర్ కి 500 బోర్లు పడే నీళ్ళు వచ్చాయి. 500 కిలో మీటర్ల దూరం నుండి మీ ఊరికి నీరు వచ్చింది. కాంగ్రెస్ హయాంలో నీరు లేదు, కరెంట్ లేదు. ఇప్పుడు కెసిఆర్ రైతులకు రైతుబంధు ఇస్తుండు, కెసిఆర్ కావాలా లేదా బిజెపి, కాంగ్రెస్ కావాలా.

ఒక గింజ లేకుండా రైతుల నుండి ప్రతి గింజ కొన్నాము. గతంతో చూస్కుంటే ఇప్పుడు చాలా అభివృద్ధి అయ్యింది. రైతు బంధు ,రైతు భీమా ఇచ్చాం. బిజెపి వాళ్ళు మోటార్ లకు మీటర్ పెడితే 30 వేల కోట్లు ఇస్తారు అంటా. కెసిఆర్ 30 వేల కోట్ల ఇయ్యకున్న సరే కానీ రైతులకు నష్టం చెయ్యను అన్నాడు. ప్రతి యూనిట్ 30 రూపాయిలకు కరెంట్ కొని రైతులకు ఫ్రీ గా కరెంట్ ఇచ్చిండు. గతంలో వర్షం కోసం అయ్యగారిని అడుగుతుండే. ఇప్పుడు అందరికీ నీళ్లు అందుబాటులో ఉన్నాయి. మీ బిడ్డ కాన్పుకు పోతే అన్ని ప్రభుత్వం చూస్కుంటుంది.

గతంలో ఎరువుల కోసం రామాయంపేట పోలీస్ స్టేషన్ ముందు లైన్ లు కడుతుండే. కళ్ళలో నీళ్ళు తెప్పించిన కాంగ్రెస్ నయమా, కాలువకి నీరు తెచ్చిన కెసిఆర్ నయమా. దేశంలో ఎక్కడైనా బిజెపి ప్రభుత్వం ఆడ పిల్లలకు కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారా. మెదక్ లో హాస్పిటల్ చాలా అభివృద్ధి చేసుకున్నాము. బిజెపి రైతు వ్యతిరేక పార్టీ , కేంద్రం బడ్జెట్ లో కోతలు పెడ్తుతుండు. ఉగాది తర్వాత కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ ఇస్తాం. మనది న్యూట్రిషన్ పాలిటిక్స్ ,బిజెపి ది పార్టిషన్ పాలిటిక్స్.

ఆ తర్వాత హైదరాబాద్ చేరుకున్న మంత్రి హరీష్ రావు… కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న (72) మృతి పట్ల సంతాపం తెలియజేశారు. సాయన్న ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్