Friday, March 13, 2026
Homeసినిమా'దసరా' నుండి వెన్నెలగా కీర్తి సురేష్ ఫస్ట్ లుక్

‘దసరా’ నుండి వెన్నెలగా కీర్తి సురేష్ ఫస్ట్ లుక్

నాని లేటెస్ట్ మూవీ ‘దసరా‘  ప్రమోషన్స్ ను ఆ సినిమా యూనిట్ వినూత్నంగా చేస్తోంది.  నాని ఫస్ట్ లుక్‌ నుంచి ఇటీవలే విడుదలైన ఫస్ట్‌ సాంగ్‌ ధూమ్‌ధామ్‌ వరకు అద్భుతమైన రెస్పాన్స్‌తో సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. తాజాగా నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా ఆమెను వెన్నెలగా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.

 అచ్చమైన పల్లెటూరి అమ్మాయిగా కీర్తి మెరిసింది. కొత్తపెళ్లి కూతురు ధరించే పసుపు చీరలో హుషారుగా డ్యాన్స్ చేస్తూ కనిపించిన కీర్తి సురేష్ దసరాలో ఆమె పాత్ర పై అంచనాలని పెంచింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రలలో కనిపించనున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు.

ఈ చిత్రానికి ఎడిటర్‌గా నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా అవినాష్‌ కొల్లా, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా విజయ్‌ చాగంటి వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 30 మార్చి 2023న విడుదల కానుంది.

Also Read : ‘దసరా’ నుంచి నాని ఊర మాస్ పోస్టర్ రిలీజ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular