Wednesday, March 18, 2026
Homeసినిమాసర్కారువారి పాట' సక్సెస్ కోసమే కీర్తి సురేశ్ వెయిటింగ్!

సర్కారువారి పాట’ సక్సెస్ కోసమే కీర్తి సురేశ్ వెయిటింగ్!

Waiting: ‘మహానటి’ సాధించిన సంచలన విజయం .. ఆ సినిమాతో కీర్తి సురేశ్ కి వచ్చిన పేరు చూసి మిగతా కథానాయికలు కంగారు పడిపోయారు. ఇక అందరి అవకాశాలు కీర్తి సురేశ్ కాగేసుకోవడం ఖాయమని అనుకున్నారు. ఆమె పారితోషికం ఎక్కడివరకూ పరిగెడుతుందోనని కాస్తంత అసూయపడ్డారు. ఇక వరుస ప్రాజెక్టులతో ఏ సినిమా ఎనౌన్స్ మెంట్ లోనైనా ఆమె పేరునే వినిపిస్తుందని అంతా భావించారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. అలా అని చెప్పి ఆమెకు ఆఫర్లు రాలేదనుకుంటే పొరపాటే. కాకపోతే అప్పటికే వరుస తమిళ సినిమాలను అంగీకరించడం ఆమె చేసిన పొరపాటే.

ఇక అక్కడి సినిమాలను పూర్తి చేసుకుని ఆమె తెలుగుకి రావడానికి కొంత సమయం పట్టింది. అలా వచ్చిన తరువాత  కూడా ఆమె లేడీ ఓరియెంటెడ్ కథలను ఓకే చేస్తూ వెళ్లింది. ‘మహానటి‘ అంటే ఆ కథ వెనుక సావిత్రి జీవితం ఉంది.  అందువలన ప్రేక్షకులు పోటెత్తారు. అలా మిగతా సినిమాలకు జరుగుతుందనుకోవడం అమాయకత్వమే. ఆ సినిమాల్లో కథా కథనాలు అంతంత మాత్రమే ఉండటం .. ఆమె నుంచి అభిమానులు ఆశించే గ్లామర్ పాళ్లు తగ్గడంతో ఆమె చేసిన నాయిక ప్రధానమైన సినిమాలు బోల్తా పడ్డాయి. దాంతో ఆమె అభిమానులు చాలా నిరాశపడ్డారు.

ఈ నేపథ్యంలోనే కీర్తి సురేశ్ కి ‘సర్కారువారి పాట’ సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఈ సినిమాలో గత రెండు సినిమాల్లో కంటే కాస్త గ్లామరస్ గానే ఆమె కనిపిస్తోంది. ‘కళావతి’గా ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు కొట్టేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘నేను శైలజ’ .. ‘నేను లోకల్’ మాదిరి గా హీరోతో కలిసి అందాల సందడి చేయాలనే ఆమె అభిమానుల ముచ్చటను ఈ సినిమా తీరుస్తుందనే అనిపిస్తోంది. ఈ పాత్రలో కీర్తిని తప్ప మరొకరిని ఊహించలేమని పరశురామ్ చెబుతున్నాడు. అంతగా ఆమె ఈ సినిమాలో ఏం చేసిందో చూడాలి. ఈ సినిమా హిట్ కావాలని అందరికంటే ఎక్కువగా కోరుకునేది కీర్తినే అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఆమెకి వచ్చిన గ్యాప్ అలాంటిది మరి!

Also Read : ఆకట్టుకున్న మ‌హేష్ బాబు ఎమోషనల్ స్పీచ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular