Friday, April 19, 2024
HomeTrending Newsఉక్రెయిన్ ను నాజీలతో పోల్చిన పుతిన్

ఉక్రెయిన్ ను నాజీలతో పోల్చిన పుతిన్

1945లో నాజీలకు పట్టిన గతే ఉక్రెయిన్ కు పడుతుందని రష్యా అధ్యక్షుడు వ్లాద్మిర్ పుతిన్ హెచ్చరించారు.  అప్పుడు ప్రపంచ యుద్ధాన్ని గెలిచాం.ఇప్పుడు యుక్రెయిన్ ను గెలుస్తాం..వరల్డ్ వార్ తరహాలోనే యుక్రెయిన్ పై గెలుపు సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు. విక్టరీ డే సెలబ్రేషన్స్ పరేడ్ కు హాజరుకావటానికి ముందు పుతిన్ కీలక ప్రకటన చేశారు. ప్రపంచ వ్యాప్తంగా మరోసారి నాజీయిజం పడగ విప్పుతోందని దాన్ని అణగదొక్కి గెలుపు సాధిస్తామన్నారు. ఉక్రెయిన్ ను నాజీలతో పోల్చిన పుతిన్ పరోక్షంగా పశ్చిమ దేశాలకు వార్నింగ్ ఇచ్చారని విశ్లేషకులు అంటున్నారు.

నెలలు గడుస్తున్నా విజయం అందకుండా పోతుండడంతో ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి యుద్ధం ప్రకటించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీ ఓటమికి గుర్తుగా రష్యాలో ప్రతి ఏడాది మే 9 న ‘విక్టరీ డే’ జరుపుకుంటారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో పాల్గొననున్న పుతిన్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. దాదాపు 11 వారాలుగా ఉక్రెయిన్‌తో జరుగుతున్న పోరును పూర్తిస్థాయి యుద్ధంగా మారుస్తున్నట్టు ఆయన ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని నాజీలపై పోరుగా అభివర్ణిస్తూ వెంటనే సైనిక బలాల్లో చేరాలంటూ పౌరులకు పిలుపునిచ్చే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. దీంతో మాస్కోలోని రెడ్ స్క్వేర్ వద్ద నేడు ఆయన చేయనున్న ‘విక్టరీ డే’ ప్రసంగంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. కాగా, నాజీయిజం మళ్లీ పురుడుపోసుకోకుండా అడ్డుకుందామని అజర్‌బైజాన్, ఆర్మేనియా, బెలారస్, కజఖ్‌స్థాన్, కిర్గిజిస్థాన్, తజకిస్థాన్ తదితర కామన్‌వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ దేశాల ప్రజలకు పుతిన్ పిలుపునిచ్చారు. విక్టరీ డే సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు.

Also Read : ఉక్రెయిన్ పతనం

RELATED ARTICLES

Most Popular

న్యూస్