Sunday, January 19, 2025
HomeసినిమాDasara: ఆ ఒక్క బిట్ కోసమైనా 'దసరా' చూడొచ్చు! 

Dasara: ఆ ఒక్క బిట్ కోసమైనా ‘దసరా’ చూడొచ్చు! 

నాని – కీర్తి సురేశ్ జంటగా నటించిన ‘దసరా’ సినిమా నిన్ననే థియేటర్లకి వచ్చింది. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాతోనే, దర్శకుడిగా శ్రీకాంత్ ఓదెలా పరిచయమయ్యాడు. కథ ఏదైనా హీరో ఇంట్రడక్షన్ .. హీరోయిన్ ఇంట్రడక్షన్ కొత్తగా ఉండాలని అభిమానులు కోరుకుంటారు. అవి చాలా ముఖ్యమైనవని వారు భావిస్తుంటారు. ఈ సినిమాలో నాని ఇంట్రడక్షన్ ఒక రేంజ్ లో ఉంటుంది. ఫస్టు షాట్ లో ఆయన గూడ్స్ రైలుతో పరిగెత్తుతున్నప్పుడే, ఆ పాత్ర ఎంత మాస్ అనేది ఆ బాడీ లాంగ్వేజ్ లో చూపించేశాడు.

సాధారణంగా హీరోయిన్ ఇంట్రడక్షన్ కోసం ఏదో ఒక ఇంట్రెస్టింగ్ సీన్ ను క్రియేట్ చేస్తారు. కానీ ఈ సినిమాలో ఒక పాట నడుస్తూ ఉండగా, ఆ పాటలోనే హీరోయిన్ పరిచయం జరిగిపోతుంది. ఆమె అంగన్ వాడి టీచర్ గా పనిచేస్తోందనీ, హీరోను కాకుండా ఆయన స్నేహితుడు సూరిని ఆమె ప్రేమిస్తుందనే విషయాన్ని కూడా అదే సమయంలో రివీల్ చేశారు. నిజంగా ఇది ఒక ప్రయోగం లాంటిదే. దీని వలన కథకి మరింత సమయం కలిసొచ్చినట్టు అయింది.

ఇంటర్వెల్ బ్యాంగ్ కి ముందు వచ్చే సీన్ .. క్లైమాక్స్ ఫైట్ ను డిజైన్ చేసిన తీరు ఈ సినిమాకి హైలైట్. నిజమైన స్నేహం ప్రాణాలను పణంగా పెడుతుంది. నిజమైన ప్రేమ ఆచారాలకు ఎదురెళుతుందని నిరూపించిన కథ ఇది. కీలకమైన సన్నివేశాలు ‘దసరా’ నేపథ్యంలో జరుగుతాయి గనుక, ఈ సినిమాకి ఈ టైటిల్ హండ్రెడ్ పెర్సెంట్ కరెక్ట్ అనిపిస్తుంది.నాని – కీర్తి సురేశ్ నటన ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణ .. ప్రధానమైన బలం. ఈ సినిమాలో పెళ్లి కూతురుగా కీర్తి సురేశ్ మాస్ స్టెప్పులు వేసే డాన్స్ బిట్ ఒకటుంది. ఆ ఒక్క బిట్ చూడటం కోసమైనా ఈ సినిమాకి వెళ్లొచ్చు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్