Sunday, January 19, 2025
HomeసినిమాDasara: 'దసరా'లో కీర్తి నటన 'మహానటి'ని మించి ఉంటుంది: నాని 

Dasara: ‘దసరా’లో కీర్తి నటన ‘మహానటి’ని మించి ఉంటుంది: నాని 

మొదటి నుంచి కూడా నాని వైవిధ్యభరితమైన కథలను .. పాత్రలను ఎంచుకుంటూ వెళుతున్నాడు. ఈ మధ్య లుక్ పరంగా కూడా ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించడానికి గట్టిగా ట్రై చేస్తున్నాడు. ‘దసరా’ సినిమాలో ఆయన లుక్ చూస్తే ఈ విషయం మనకి అర్థమవుతుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 30వ తేదీన థియేటర్లకు వస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ‘అనంతపూర్’లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.

ఈ స్టేజ్ పై నాని మాట్లాడుతూ ..  సీడెడ్ ఏరియాలో మాస్ సినిమాలు ఎక్కువగా ఆడతాయని అంటూ ఉంటారు. ఇన్ని రోజులు మిమ్మల్ని మెప్పించిన మాస్ సినిమాలు చూసి ఉంటారు. మీ మనసుకు హత్తుకునే మాస్ సినిమాగా ‘దసరా’ ఉంటుందని మీ అందరికీ నేను ప్రామిస్ చేస్తున్నాను. తెరపై  మాస్ యాక్షన్ చూస్తూ విజిల్స్ వేసి ఉంటారు .. కన్నీళ్లు పెట్టుకుంటూ విజిల్స్ వేసి ఉండరు. అలాంటి ఒక అనుభవాన్ని ఈ నెల 30వ తేదీన మీరు పొందబోతున్నారు” అని అన్నాడు.

“ఒక ఏడాది పాటు దుమ్ములో .. ధూళిలో కష్టాలు పడుతూ చేసిన సినిమా ఇది. ఈ సినిమా చేసిన వాళ్లందరికీ ఆ జ్ఞాపకాలు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. కీర్తి సురేశ్ గురించి చెప్పకపోతే చంపేస్తుంది. ‘నేను లోకల్’ తరువాత మళ్లీ చేస్తే ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక సినిమా చేయాలని నేను .. కీర్తి అనుకున్నాను. అలా గుర్తుండిపోయే సినిమా ఇది. కొన్ని సీన్స్ లో ‘మహానటి’ని మించిన పెర్ఫార్మెన్స్ ను ఆమె చూపించిందని నాకు అనిపించింది. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకంతో మేము ఉన్నాము .. హిట్ చేయవలసిన బాధ్యత మీపై ఉంది” అంటూ చెప్పుకొచ్చాడు.

Also Read : డీ గ్లామర్ రోల్స్ దిశగా గ్లామరస్ హీరోయిన్స్!

RELATED ARTICLES

Most Popular

న్యూస్