కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే 3 నెలల్లో ఢిల్లీ లో వాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ చెప్పారు. ఢిల్లీ లో 18 ఏళ్ళు నిండిన వారు కోటిన్నర మంది ఉన్నారని వారికోసం 3 కోట్ల డోసులు అవసరమని, కేంద్రం ఇప్పటివరకూ 40 లక్షల డోసులు మాత్రమే సరఫరా చేసిందని కేజ్రివాల్ వెల్లడించారు. రోజుకు లక్ష డోసులు పంపిణి చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధంగా ఉందన్నారు.
మరో నాలుగు రోజులకు సరిపడా వాక్సిన్ నిల్వలు తమవద్ద వున్నాయని, ఢిల్లీ ప్రభుత్వానికి ఇంకో 2.6 కోట్ల డోసులు అవసరమని వెంటనే వాక్సిన్ డోసులు పంపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రోజువారీ డోసుల్లో 45 ఏళ్ళు పైబడిన వారికి 50 వేలు, మరో 50 వేల డోసులు 18-45 ఏళ్ళ లోపు వారికి అందిస్తున్నామని వివరించారు.