ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు వ్యతిరేకంగా ఇవాళ కేరళ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతారు. సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌తో పాటు కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ .. యూసీసీని వ్యతిరేకిస్తున్నాయి. అయితే కేరళ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పటికే యూసీసీకి వ్యతిరేకంగా సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు వరుసగా సెమినార్లు, మీటింగ్‌లు నిర్వహించాయి. పౌరసత్వ సవరణ చట్టం, సాగు చట్టాలకు వ్యతిరేకంగా కూడా కేరళ అసెంబ్లీలో గతంలో తీర్మానం చేశారు. సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానాన్ని పాస్ చేసిన తొలి రాష్ట్రం కేరళ. జనవరి 2020లో ఆ రాష్ట్రం ఆ తీర్మానాన్ని ఆమోదించింది. సీఎం విజయన్ ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.