Monday, January 20, 2025
HomeTrending Newsకేరళ కాంగ్రెస్ చీఫ్ పిటి థామస్ కన్నుమూత

కేరళ కాంగ్రెస్ చీఫ్ పిటి థామస్ కన్నుమూత

Kerala Congress Chief Pt Thomas Is No More : 

కేరళ పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే పిటి థామస్ ఇకలేరు. కొన్నాళ్ళుగా క్యాన్సర్ తో బాధపడుతున్న థామస్ ఈ రోజు తమిళనాడు లోని వేలూరు ఆస్పత్రిలో ఈ రోజు  తుదిశ్వాస విడిచారు. నెల రోజులుగా వేలూరు ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్న థామస్ కేరళలోని తిక్కకర నియోజవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యే గా ఒకసారి ఎంపి గా గెలిచినా 71 ఏళ్ళ థామస్ కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు.

2009లో ఇడుక్కి లోకసభ స్థానం నుంచి గెలిచిన థామస్ అంతకు ముందు ఇడుక్కి జిల్లాలోని తోడుపుజ శాసనసభ స్థానం నుంచి అసెంబ్లీ లో ప్రాతినిధ్యం వహించారు. 1991లో శాసనసభ్యుడిగా గెలిచి రాజకీయ ప్రస్తానం ప్రారంభించిన థామస్  కాంగ్రెస్ అధికార పత్రిక వీక్షణం సంపాదకుడిగా సుధీర్గకాలం సేవలు అందించారు. థామస్ కు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు.

థామస్ మృతికి AICC అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధి, ప్రియాంక గాంధీ పార్టీ సీనియర్ నేతలు సంతాపం ప్రకటించారు.

Also Read : మయన్మార్లో గని ప్రమాదం – 80 మంది గల్లంతు

RELATED ARTICLES

Most Popular

న్యూస్