Sunday, January 19, 2025
HomeTrending NewsKeshav Hegde: సంఘ్ ప్రచారక్ కేశవ్ హెగ్డే మృతి

Keshav Hegde: సంఘ్ ప్రచారక్ కేశవ్ హెగ్డే మృతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సీనియర్ ప్రచారక్ కేశవ్ హెగ్డే మరణం బాధాకరం. గుండెపోటుతో బుధవారం (5-7-2023) మధ్యాహ్నం 3:30 నిమిషాలకు బెంగళూరులోని విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో వారు కన్నుమూయడం అత్యంత బాధాకరం. ఆయన మరణ వార్త వినగానే.. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఉమ్మడి కర్ణాటక రాష్ట్రాల్లోని విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పరిచయం ఉన్న సంఘపరివార్ కార్యకర్తల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీ సమీపంలో గల శిరసి అనే గ్రామానికి చెందినవారు కేశవ్ హెగ్డే. రేపు ( 6-7-2023) వారి స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

ప్రస్తుత భాగ్యనగర్ క్షేత్రం అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం తో పాటు కర్ణాటకలోని రెండు ప్రాంతాలు కలిపి మొత్తం నాలుగు రాష్ట్రాలకు సంఘటన మంత్రిగా కేశవ్ హెగ్డే విశ్వహిందూ పరిషత్ కు సేవలందించారు. నిరంతరం చిద్విలాసంగా నవ్వుతూ కలకలలాడే కేశవ్ కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేవారు. పనిచేసే కార్యకర్తలను అమితంగా ఇష్టపడేవారు. కార్యకర్త మనసును తెలుసుకొని మసులుకునేవారు. చిరు నవ్వు తప్ప.. ఏనాడూ ఆగ్రహం ఎరుగని వ్యక్తిత్వం వారిది. 2015 లో విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం కోటిలో వారితో నాకు పరిచయం ఏర్పడింది. అప్పటికి వారు కర్ణాటక రాష్ట్ర సంఘటన మంత్రి. ఆ తర్వాత 2017 నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తో పాటు కర్ణాటక రాష్ట్రంలోని రెండు ప్రాంతాలకు బెంగళూరు క్షేత్ర సంఘటన మంత్రిగా వ్యవహరించేవారు.

తెలంగాణ ప్రాంతానికి చాలా కాలం పాటు సంఘటన మంత్రి లేకపోయినా అన్ని వారే చూసుకునేవారు. 2019 లో నాలుగు ప్రాంతాలు, మూడు రెవెన్యూ రాష్ట్రాలు (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ) ప్రచార ప్రముఖుల సమావేశం నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ప్రచార ప్రముఖులను భాగ్యనగర్ కు పంపించారు. ఈ సమావేశానికి అఖిల భారత ప్రచార ప్రముఖ్ విజయశంకర్ తివారి హాజరయ్యారు.

బెంగళూరు, ఉడిపి, కర్ణాటకకు సంబంధించిన చాలామంది ప్రముఖులు భాగ్యనగర్ లో ఉద్యోగము, వ్యాపారం చేస్తున్నారు. వారందరినీ కలిసే క్రమంలో చాలా తోడ్పాటు గా ఉండేవారు. ఇటీవల రాయపూర్ లో జరిగిన విశ్వహిందూ పరిషత్ సమావేశాల సందర్భంగా కూడా అక్కడ జరిగే ప్రతి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్