Saturday, January 18, 2025
Homeసినిమారామ్ చరణ్‌ తో ప్రశాంత్ నీల్?

రామ్ చరణ్‌ తో ప్రశాంత్ నీల్?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం ఆచార్య, ఆర్ఆర్ఆర్ సినిమాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలు పూర్తి చేసిన తర్వాత రామ్ చరణ్.. తమిళ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో భారీ చిత్రం చేయనున్నారు. ఈ పాన్ ఇండియా మూవీని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇది చరణ్ కి 15వ సినిమా కాగా, దిల్ రాజుకి 50వ చిత్రం కావడం విశేషం. ఆమధ్య ఈ క్రేజీ మూవీని అఫిషియల్ గా ఎనౌన్స్ చేయడం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ సినిమాని ఎప్పుడు సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారనేది త్వరలో ఎనౌన్స్ చేస్తారని సమాచారం.

ఇదిలా ఉంటే.. కేజీఎఫ్ సినిమాతో ఇండియా స్ధాయిలో గుర్తింపు తెచ్చుకున్న సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో రామ్ చరణ్‌ ఓ సినిమా చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ 2 రిలీజ్ కి రెడీగా ఉంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నారు. ఈ మూవీని అధికారికంగా ప్రకటించడం కూడా జరిగింది. ఆతర్వాత రామ్ చరణ్‌ తో సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ ఉంటుందా..? ఉంటే.. ఏ జోనర్ లో మూవీ ఉంటుంది అనేది ఆసక్తిగా మారింది. క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్