Saturday, July 27, 2024
HomeTrending Newsఇండో నేపాల్ భాయి  భాయి

ఇండో నేపాల్ భాయి  భాయి

భారత్ – నేపాల్ సంబంధాలు ఎన్నటికి విడదీయలేనివని నేపాల్ ప్రధానమంత్రి ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలి స్పష్టం చేశారు. గతంలో జరిగిన అపార్థాలను వీడి రెండు దేశాలు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందన్నారు. బిబిసి హిందీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో నేపాల్ ప్రధాని రెండు దేశాల స్నేహాన్ని బలోపేతం చేసే దిశగా కృషి చేస్తానన్నారు.

ఇండియా – నేపాల్ మధ్య భౌగోళిక, సాంస్కృతిక సంబంధాలు బలమైనవని, ప్రపంచంలో భారత్ మినహా మరో దేశంతో నేపాల్ కు ఆ బాంధవ్యం లేదని ఓలి గుర్తు చేశారు. అయితే పొరుగు దేశాల మధ్య స్నేహం ఎంతగా ఉంటుందో కొన్ని సమస్యలు కూడా ఉంటాయన్నారు. వాటిని పరిష్కరించుకొని భవిష్యతు వైపు పయనించాలని పిలుపు ఇచ్చారు.

రెండు దేశాల మధ్య రాకపోకలకు సరిహద్దుల్లో ఎలాంటి ఆంక్షలు లేవని, నేపాల్ కు సాయం అందించే విషయంలో  ఇండియా ప్రత్యెక శ్రద్ధ చూపాలని హిమాలయ దేశ ప్రధాని కోరారు. కోవిడ్ మహమ్మారి కట్టడిలో భారత ప్రభుత్వం నేపాల్ కు సహకరించాలన్నారు. కరోన మొదలైనప్పటి నుంచి వైద్య పరంగా, వ్యాక్సిన్ సరఫరా చేసి ఆదుకున్నా, నేపాలీలు అంచనా వేసిన స్థాయిలో భారత్ నుంచి సాయం అందలేదని ప్రధాని ఓలి అన్నారు.

కోవిడ్ రెండో దశ ఎదుర్కోవడంలో వైపల్యం చెందారని స్వదేశంలో ప్రధాని ఓలి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. భారత్ సహకారం లేకుండా కరోన మహమ్మారి నిర్మూలన సాధ్యం కాదని గ్రహించే ఓలి స్నేహ హస్తం ఇస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్