Tuesday, September 17, 2024
HomeTrending NewsSudan: సుడాన్ లో రోడ్ల పైనే మృత దేహాలు

Sudan: సుడాన్ లో రోడ్ల పైనే మృత దేహాలు

పశ్చిమ దేశాల రాజకీయ క్రీడలో ఆఫ్రికా దేశం సుడాన్ ఆహుతి అవుతోంది. అపారమైన బంగారు గనుల నిల్వలు ఉన్న సుడాన్ లో వాటి తవ్వకం కాంట్రాక్టు రష్యా కంపెనీ కి వచ్చింది. అప్పటి దేశాధ్యక్షుడు అల బషీర్… రష్యాకు చెందిన ఎం ఇన్వెస్ట్ కంపెనీకి కట్టబెట్టారు. ఆ కంపెనీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు చెందిన వాగ్నర్ సంస్థలో భాగమని అమెరికా ఆరోపించింది. ఇక అప్పటి నుంచి ఆ దేశాధ్యక్షుడిని గద్దె దింపటం… సైన్యం, పార మిలిటరీ వర్గాల మధ్య కయ్యం సృష్టించటం…. పైకి మాత్రం ఆ దేశానికి సాయం చేస్తున్నట్టుగా అమెరికా దాని మిత్ర దేశాలు పనిచేస్తున్నాయి. తాజాగా సైన్యం…పారామిలటరీ వర్గాల మధ్య జరుగుతున్న పరస్పర దాడులు… తుపాకీ కాల్పులు, బాంబు పేలుళ్లతో సూడాన్‌ రాజధాని ఖార్తోమ్‌ దద్దరిల్లుతున్నది. సూడాన్‌ ఆర్మీ, పారామిలటరీ బలగాలకు మధ్య పెద్దఎత్తున తుపాకీ కాల్పులు, బాంబు దాడులు కొనసాగుతున్నాయి.

రాజకీయ అధికారం కోసం ఇరు వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో ఇప్పటిదాకా 270 మందికిపైగా అమాయక పౌరులు చనిపోయారని సమాచారం. పౌరుల మృతదేహాలు వీధుల్లో, రోడ్లపై కనపడుతున్నాయి. ఘర్షణ కారణంగా భారతీయులెవరు అక్కడ భారత ఎంబసీకి వెళ్లద్దని భారత ప్రభుత్వం సూచించింది. వైమానిక దాడులకు తెగబడటంతో ఖార్టూమ్‌ విమానాశ్రయంతో పాటు చుట్టు పక్కల భవనాలు మంటలు, నల్లటి పొగలు కమ్ముకున్నాయి. అక్కడి సామాన్య ప్రజలతో పాటు విమానాశ్రయంలో ప్రయాణికులు సైతం బాంబుల మోతను తట్టుకోలేక ప్రాణాలను కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నానికి సంబంధించిన వీడియోలు ట్విట్టర్‌లో వైరల్ అవుతున్నాయి.

సూడాన్‌లో సైన్యం, పారా మిలటరీ బలగాల మధ్య ఘర్షణ కారణంగా పరిస్థితులు హింసాత్మకంగా మారాయని ..అక్కడ ఉంటున్న భారతీయులు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూడాన్‌లోని భారత ఎంబసీ ట్విట్టర్‌ ద్వారా అప్రమత్తం చేసింది. ఇప్పటికే సూడాన్ అధ్యక్ష భవనం, బుర్హాన్ నివాసం, ఖార్టూమ్‌లోని ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ని పారా మిలటరీ ర్యాపిడ్ సోపర్ట్ ఫోర్స్ తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. సూడాన్‌లోని పారా మిలటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ దళాన్ని సైన్యంలోకి విలీనం చేసేందుకు తీసుకున్న నిర్ణయం కారణంగానే ఈ అల్లర్లకు ఆజ్యం పోసినట్లుగా తెలుస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్