Friday, March 29, 2024
Homeసినిమాప్ర‌భాస్ స్పిరిట్ మూవీలో కైరా.. ఇది నిజమేనా?

ప్ర‌భాస్ స్పిరిట్ మూవీలో కైరా.. ఇది నిజమేనా?

Kiara Advani?: పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం ఆదిపురుష్‌, స‌లార్, ప్రాజెక్ట్ కే చిత్రాల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాల‌తో పాటు ప్ర‌భాస్.. స్పిరిట్ అనే సినిమాకి కూడా ఓకే చెప్పారు. ఈ చిత్రానికి సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఇది ప్ర‌భాస్ 25వ చిత్రం కావ‌డం విశేషం. ప్ర‌స్తుతం సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ లో యానిమ‌ల్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ తో స్పిరిట్ మూవీ ఉంటుంది.

అయితే.. ఈ చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ న‌టించ‌నుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. కైరా అద్వానీ భ‌ర‌త్ అనే నేను సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా స‌క్సెస్ సాధించింది. ఆత‌ర్వాత విన‌య విధేయ రామ చిత్రంలో న‌టించింది.ఈ మూవీ ప్లాప్ అయ్యింది. ప్ర‌స్తుతం చ‌ర‌ణ్‌, శంక‌ర్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీలో న‌టిస్తోంది. ఈ సినిమాతో ఈ అమ్మ డుకు టాలీవుడ్ లో మాంచి క్రేజ్ వ‌స్తుంద‌ని కైరానే స్పిరిట్ మూవీకి ఫిక్స్ చేశార‌ని టాక్.

ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త‌ల పై కైరా తరఫు అధికార ప్రతినిధి స్పందించారు. స్పిరిట్ సినిమా కోసం తమని ఎవరూ ఇంత వరకూ సంప్రదించలేదని ఆయన స్పష్టం చేశారు. అందువలన స్పిరిట్ మూవీలో కైరా న‌టిస్తుంది అంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్త‌వం లేదని చెప్పారు. ఆమె చేసే కొత్త ప్రాజెక్టుల వివరాలను అధికారికంగా తెలియజేస్తామన్నారు. మ‌రి.. కైరా కాక‌పోతే.. స్పిరిట్ లో ప్ర‌భాస్ స‌ర‌స‌న న‌టించే ఛాన్స్ ఎవ‌రు ద‌క్కించుకుంటారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్