Srikantha- History:
సెమీస్ పోరులో కిడాంబి శ్రీకాంత్ దే పైచేయి అయ్యింది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ షిప్-2021 టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో ఇద్దరు భారత ఆటగాళ్ళు కిడాంబి శ్రీకాంత్- లక్ష్య సేన్ లు ఫైనల్ బెర్త్ కోసం తలపడ్డారు. మొదటి సెట్ ను లక్ష్య సేన్ 21-17 తేడాతో గెల్చుకున్నాడు. ఆ తర్వాత తేరుకున్న శ్రీకాంత్ రెండో సెట్ ను 21-14 తో గెల్చాడు. నిర్ణాయక మూడో సెట్ లో శ్రీకాంత్ తన అనుభవాన్ని రంగరించి ఆడి 21-17తో చేజిక్కించుకుని ఫైనల్లో అడుగుపెట్టాడు. లక్ష్య సేన్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సంపాదించాడు.
మనదేశం నుంచి వరల్డ్ ఛాంపియన్ షిప్ పురుషుల సింగిల్స్ లో ఫైనల్లో ఆడుతున్న మొదటి షట్లర్ గా శ్రీకాంత్ చరిత్ర సృష్టించాడు.
ఆదివారం సాయంత్రం జరిగే ఫైనల్ మ్యాచ్ లో సింగపూర్ ఆటగాడు లొహ్ కీన్ యెవ్ తో టైటిల్ కోసం కిడాంబి శ్రీకాంత్ తలపడనున్నాడు. వరల్డ్ ర్యాంకింగ్స్ లో శ్రీకాంత్ 14వ స్థానంలో ఉండగా, లొహ్ 22వ స్థానంలో ఉన్నాడు.