Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్Badminton: కిడాంబికి షాక్....మహిళల ఫైనల్లో ఆకర్షి, అనుపమ

Badminton: కిడాంబికి షాక్….మహిళల ఫైనల్లో ఆకర్షి, అనుపమ

బ్యాడ్మింటన్ జాతీయ ఛాంపియన్ షిప్ పోటీల్లో స్టార్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ సెమీస్ లో ఓటమి పాలయ్యాడు. ఎం. మిథున్ చేతిలో 21-19;21-13 తేడాతో ఓటమి పాలయ్యాడు. మరో సెమీస్ లో ప్రియాన్షు రాజావాత్ 21-14;21-15తో హర్షీల్ డానీ పై విజయం సాధించాడు.

మహిళల సింగిల్స్ లో ఆకర్షి కాశ్యప్ 21-9; 21-19తో ఆదితా రావు పై విజయం సాధించింది. మరో సెమీస్ లో అనుమప ఉపాధ్యాయ 21-18; 11-21; 21-18తో ఆశ్మిత చలీహాను ఓడించింది టైటిల్ రేసు లో నిలిచింది.

పురుషుల డబుల్స్ లో కుశాల్ రాజ్- ప్రకాష్ రాజ్ జోడీ; దీప్ రాంబియా-అక్షణ్ శెట్టి  జోడీలు ఫైనల్స్ కు చేరుకున్నాయి.

మహిళల డబుల్స్ లో గాయత్రి గోపీ చాంద్- త్రెసా జాలీ; కావ్య గుప్తా- దీప్ శిఖా సింగ్ జోడీలు ఫైనల్లో అడుగు పెట్టారు.

మిక్స్డ్ డబుల్స్ లో సిద్దార్థ్ ఎలంగో- ఖుషి గుప్తా; హేమ నాగేంద్రబాబు-కనిక కున్వాల్ జోడీలు తమ ప్రత్యర్థులను ఓడించి ఫైనల్లో అడుగు పెట్టారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్