Monday, January 27, 2025
Homeస్పోర్ట్స్Indonesia Open: క్వార్టర్స్ కు శ్రీకాంత్, ప్రణయ్- సింధు, సేన్ ఔట్

Indonesia Open: క్వార్టర్స్ కు శ్రీకాంత్, ప్రణయ్- సింధు, సేన్ ఔట్

జకార్తా లో జరుగుతోన్న ఇండోనేషియా ఓపెన్-2023లో భారత షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, హెచ్ ఎస్ ప్రణయ్, సాత్విక్-చిరాగ్ జోడీ క్వార్టర్ ఫైనల్స్ లో ప్రవేశించారు. పివి సింధు, ప్రియాన్షు రాజావత్, లక్ష్య సేన్ లు ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు.

  • పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడీ 21-15; 21-17 తేడాతో చైనా ద్వయంపై విజయం సాధించారు.
  • పురుషుల సింగిల్స్ లో హెచ్ ఎస్ ప్రణయ్ 21-18; 21-16 తో హాంగ్ కాంగ్ ఆటగాడు లాంగ్ అన్గుస్ పై గెలుపొందాడు
  • పురుషుల సింగిల్స్ లో కిడాంబి శ్రీకాంత్ మన దేశానికే చెందిన లక్ష్య సేన్ పై 21-17; 22-20 నెగ్గాడు.

కాగా, చైనీస్ తైపీ ప్లేయర్  తైజు యింగ్ 21-18;21-16 తో పివి సింధును ఓడించింది

పురుషుల సింగిల్స్ లో ప్రియాన్షు రాజావత్ పై ఇండోనేషియా ప్లేయర్ అంటోనీ సినిసుక గింటింగ్ 20-22; 21-15;21-15తో గెలిచాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్