Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్Japan Open: తొలి రౌండ్ లో కిడాంబి, ప్రణయ్ విజయం

Japan Open: తొలి రౌండ్ లో కిడాంబి, ప్రణయ్ విజయం

జపాన్ ఓపెన్-2023 తొలి రౌండ్ లో భారత ఆటగాళ్ళు కిడాంబి శ్రీకాంత్, హెచ్ ఎస్ ప్రణయ్ మహిళల డబుల్స్ లో గాయత్రి గోపీ చంద్- త్రెసా జాలీ జోడీ విజయం సాధించారు.

పురుషుల సింగిల్స్ లో హెచ్ ఎస్ ప్రణయ్ 21-17; 21-13తో చైనా ఆటగాడు లీ షి ఫెంగ్ పై విజయం సాధించాడు, మరో మ్యాచ్ లో కిడాంబి శ్రీకాంత్  తైపీ ఆటగాడు చౌ టీ చెన్ పై 21-13; 21-13 తో గెలుపొందాడు.

మహిళల సింగిల్స్ లో గాయత్రి-జాలీ జోడీ 11-21; 21-15;21-14 తేడాతో జపాన్ జంట సయాకా హోబార- స్యూజు పై నెగ్గారు. తొలి సెట్ కోల్పోయినా ఆ తర్వాతా మెరుగైన ఆట తీరు ప్రదర్శించి ప్రత్యర్ధులపై పైచేయి సాధించారు.

కాగా,  మహిళల సింగిల్స్ లో ఆకర్షి కాశ్యప్… మిక్స్డ్ డబుల్స్ లో రోహన్ కపూర్-సిక్కీ రెడ్డి జంట తమ ప్రత్యర్థులపై ఓటమి పాలై తొలి రౌండ్ లోనే నిష్క్రమించారు.

రేపు మ్యాచ్ ల్లో సింధు, లక్ష్య సేన్, సాత్విక్-చిరాగ్ జోడీ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్