Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్జర్మన్ ఓపెన్: క్వార్టర్స్ కు శ్రీకాంత్, ప్రన్నోయ్, సేన్

జర్మన్ ఓపెన్: క్వార్టర్స్ కు శ్రీకాంత్, ప్రన్నోయ్, సేన్

German Open-2022:   భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు జర్మన్ ఓపెన్ రెండో రౌండ్లో ఓటమి పాలైంది. నేడు జరిగిన మ్యాచ్ లో సింధు 14-21; 21-15; 14-21 తేడాతో చైనా క్రీడాకారిణి ఝాంగ్ ఈ మాన్ చేతిలో  ఓడిపోయింది. మరో మ్యాచ్ లో సైనా నెహ్వాల్ కూడా థాయ్ లాండ్ క్రీడాకారిణి ఇంటానన్ చేతిలో 21-10; 12-15తో పరాజయం పాలైంది. దీనితో మహిళల సింగిల్స్ విభాగంలో ఇండియా పోరు ముగిసినట్లే అయ్యింది.

పురుషుల సింగిల్స్ లో కిడాంబి శ్రీకాంత్ చైనా ఆటగాడు లూ గాంగ్ జూ పై 21-18; 21-23; 21-16  తో విజయం సాధించగా, మరో మ్యాచ్ లో హెచ్.ఎస్. ప్రన్నోయ్ 21-19; 24-22 తో హాంగ్ కాంగ్ క్రీడాకారుడు లీ చ్యుక్ యూను ఓడించాడు. మూడో మ్యాచ్ లో లక్ష్య సేన్ 21-7; 21-9 తేడాతో సునాయాసంగా ఇండోనేషియా ఆటగాడు అంటోనీ సినిసుకా గింటింగ్ ను ఓడించాడు.

పురుషుల డబుల్స్ లో కృష్ణ ప్రసాద్-విష్ణువర్ధన్ గౌడ్ ద్వయం  మన దేశానికే చెందిన ఇషాన్ భట్నాగర్ – సాయి ప్రతీక్ జోడీపై 23-21; 16-21; 21-14 తో విజయం సాధించి మూడో రౌండ్లోకి అడుగు పెట్టారు.

మహిళల డబుల్స్ లో థెరీసా జాలీ-గాయత్రి గోపీచంద్ జంట 21-16; 21-12 తేడాతో  చైనా జోడీ  చెన్ కింగ్ చెన్- జి యా ఈ ఫాన్ చేతిలో ఓటమి పాలయ్యారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్