Sunday, June 7, 2026
Homeసినిమాభారీ ప్లానింగ్ లో.. కిరణ్ అబ్బవరం

భారీ ప్లానింగ్ లో.. కిరణ్ అబ్బవరం

లేటెస్ట్ సెన్సేషన్ కిరణ్ అబ్బవరం 2019లో ‘రాజా వారు రాణి గారు’తో అరంగేట్రం చేసాడు. ఈ సినిమా మంచి హిట్ అయింది. తన నటనతో, అమాయకంతో కూడిన క్యారెక్టర్‌తో యువతను ఆకట్టుకున్నాడు. తర్వాత 2021లో కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గా వచ్చిన ‘ఎస్.ఆర్. కల్యాణ మండపం’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో కోవిడ్ తర్వాత థియేటర్లకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి అతన్ని కమర్షియల్ హీరోగా పరిచయం చేసింది. ఈ సినిమాలోని తండ్రీ కొడుకుల ఎమోషన్స్‌కి బిసి సెంటర్స్‌లో, ఫ్యామిలీస్‌లో విపరీతమైన క్రేజ్‌ వచ్చింది.

2022లో ప్రేమకథ మరియు కమర్షియల్ సినిమా తర్వాత అతను కాన్సెప్ట్ బేస్డ్ థ్రిల్లర్ ‘సెబాస్టియన్ పిసి 524’ని ప్రయత్నించాడు. ఇందులో అతను నైట్ బ్లైండ్డ్ పోలీసుగా నటించాడు. అయితే.. అతని కెరీర్ ప్రారంభ దశలలో ఈ ప్రయత్నం నటుడిగా ప్రశంసించబడినప్పటికీ, ఈ చిత్రం కమర్షియల్ గా హిట్ కాలేదు. ఆ తరువాత సమ్మతమే మే 24, 2022న విడుదలై విజయవంతమైంది. ఈ చిత్రం మల్టీప్లెక్స్ ప్రేక్షకులను ఆకట్టకుంది. మరియు మహిళా ప్రేక్షకులను మరింతగా ఆకర్షించింది. ఈ ట్రయల్స్‌లో విభిన్నమైన జోనర్‌లు మరియు డిసెంట్ గ్రాఫ్‌తో సెప్టెంబర్ 16న విడుదలైన కొత్త కమర్ “నేను మీకు బాగా కావాల్సినవాడిని” డిజాస్టర్‌గా నిలిచి అతని కెరీర్‌లో కుదుపును సృష్టించింది.

అతని ప్రారంభ చిత్రాల తర్వాత ప్రేక్షకులు అతని నుండి ఎక్కువ ఆశించారు, కానీ ఈ ఒక్క చిత్రం ఫెయిల్ అవ్వడంతో అతని మునుపటి పనుల ఫలితాలతో సంబంధం లేకుండా ట్రోల్ చేశారు. అయితే.. అతని చివరి చిత్రం ఫలితం ఎలా ఉన్నప్పటికీ, ప్రస్తుతం అతని క్రేజ్ మాత్రం అలానే ఉంది. ప్రస్తుతం కిరణ్ చేతిలో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇటీవల అతను ఒక ప్రముఖ కార్పొరేట్ ఈవెంట్‌కు అతిథిగా హాజరయ్యాడు. కొన్ని పాపులర్ బ్రాండ్‌లు అతనిని సంప్రదించాయి. వారిలో కొంత మందితో చర్చలు జరుగుతున్నాయి. షార్ట్ ఫిల్మ్స్ నుంచి కెరియర్ మొదలు పెట్టి ప్రస్తుతం ఫుల్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న అతని ప్రయాణం ఖచ్చితంగా అభినందించాల్సిన విషయం. మైత్రీ మూవీ మేకర్స్, గీతా ఆర్ట్స్, ఏఎమ్ రత్నం & ఏషియన్ సినిమాస్ వంటి పెద్ద బ్యానర్‌లతో సినిమాలు చేస్తున్నాడు. స్టార్ లీగ్‌లోకి ప్రవేశించడానికి  ఒక హిట్ కావాలి. 2023 సంత్సరంలో ఫుల్ బిజీగా వరుస ప్రోజెక్ట్స్ ను లైన్ లో పెట్టాడు ఈ యంగ్ హీరో. మరి.. 2023లో బ్లాక్ బస్టర్ సాధిస్తాడేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular