Thursday, April 18, 2024
Homeసినిమానేను మీకు బాగా కావాల్సిన‌వాడిని అంటున్న కిరణ్

నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని అంటున్న కిరణ్

Kiran new film: శ‌తాధిక చిత్ర ద‌ర్శ‌కుడు, అజాత‌శత్రువు అయిన కీర్తిశేషులు శ్రీ కోడి రామ‌కృష్ణ పెద్ద కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాత‌గా త‌న ప్రొడక్షన్ నెం 1 గా కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లో కార్తిక్ శంక‌ర్ ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ఒక చిత్రాన్ని నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో రాజావారి రాణిగారు, ఎస్ ఆర్ క‌ళ్యాణ‌మండ‌పం లాంటి సూప‌ర్‌హిట్స్ తో తెలుగు ప్రేక్ష‌కుల ‌హృద‌యాల్లో కుటుంబ స‌భ్యుడిగా మారిన కిరణ్ అబ్బ‌వ‌రం హీరోగా న‌టిస్తున్నారు. అయితే ఈ చిత్రం ఇప్ప‌టికే టాకీ పార్ట్ పూర్తిచేసుకుంది. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ ఆడియోని ల‌హ‌రి మ్యూజిక్ ద్వారా మార్కెటింగ్ చేస్తున్నారు.

కోడి రామ‌కృష్ణ సమ‌ర్ప‌ణ‌లో వ‌స్తున్న ఈ చిత్రానికి ‘నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని’ అనే టైటిల్ ని ఖ‌రారు చేశారు. కోడి రామ‌కృష్ణ చిత్రాలన్ని ఫ్యామిలీ అంతా థియేటర్స్ కి వెళ్ళి చూసేవారు. ఇప్ప‌టికీ టీవి లో ఆయ‌న చిత్రాలు వ‌స్తున్నాయంటే ఫ్యామిలీ అంతా కూర్చొని చూస్తుంటారు.

కోడి రామ‌కృష్ణ గారి దివ్య ఆశీస్ఆసులతో  టైటిల్ ని ఈరోజు ఎనౌన్స్ చేయ‌డం జ‌రిగింది. ఈ చిత్రానికి సంబందించిన ఫ‌స్ట్ లుక్ ని కూడా విడుదల చేశారు. కిర‌ణ్ అబ్బ‌వ‌రం ల‌వ‌ర్ బాయ్ లుక్ చూసిన ప్రేక్ష‌కులు ఒకేసారిగా మాస్ క‌మ‌ర్షియ‌ల్ లుక్ లో అంద‌ర్ని ఆక‌ట్టుకున్నాడు. టాలీవుడ్ లో వున్న క‌మ‌ర్షియ‌ల్ హీరోల స‌ర‌స‌న చేరేలా ఈ లుక్ వుండ‌టం విశేషం. ఈ సినిమాకి సంబందించిన ఎక్సైట్‌మెంట్ న్యూస్ మ‌రి కొన్ని రొజుల్లో తెలియ‌జేయ‌నున్నారు.

Also Read : కిరణ్ అబ్బవరం ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రం ప్రారంభం

RELATED ARTICLES

Most Popular

న్యూస్