Sunday, June 7, 2026
Homeసినిమాకుర్రహీరో కాస్త యాక్షన్ .. ఇంకాస్త స్టైల్ యాడ్ చేసినట్టున్నాడే!

కుర్రహీరో కాస్త యాక్షన్ .. ఇంకాస్త స్టైల్ యాడ్ చేసినట్టున్నాడే!

నాని తరువాత ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చి, తన ప్రత్యేకతను చాటుకోవటానికి ట్రై చేస్తున్న హీరోగా కిరణ్ అబ్బవరం కనిపిస్తున్నాడు. ఆరంభంలో నటన విషయంలో కాస్త యావరేజ్ గా అనిపించిన ఈ కుర్రాడు, సినిమా .. సినిమాకి తనలోని నటుడిని ఒక్కో మెట్టూ ఎక్కిస్తూనే వెళుతున్నాడు. లవ్ .. మాస్ యాక్షన్ .. కామెడీ మిస్సవ్వకుండా కథలను సెట్ చేసుకుంటున్నాడు. ప్రేక్షకులతో గ్యాప్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

ఒకప్పుడు హీరోలకు తమకంటూ ఒక స్టైల్ ఉండేది. కానీ ఈ తరం హీరోలు ఈ స్టైల్ ను సెట్ చేసుకోవడంపై దృష్టిపెట్టడం లేదు … శ్రద్ధ పెట్టడం లేదు. కానీ కిరణ్ అబ్బవరం ఈ విషయంపై కూడా ఒక లుక్ వేశాడనే విషయం అర్థమవుతోంది. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమాలో కిరణ్ యాక్షన్ ఎపిసోడ్స్ పై ఎక్కువ కేర్ తీసుకున్నాడనే విషయం తెలిసిపోతుంది. అదే విధంగా డాన్స్ విషయంలోను బాగానే రెచ్చిపోయాడు.

ఇక రీసెంట్ గా వచ్చిన ‘మీటర్’ సినిమా టీజర్ విషయానికే వస్తే, యాక్షన్ పాళ్లు మరింత పెంచాడని అర్థమవుతోంది. అలాగే బాడీ లాంగ్వేజ్ మార్చేసి .. తనకంటూ ఒక స్టైల్ ను సెట్ చేయడానికి ఆయన ట్రై చేయడానికి ప్రయత్నించినట్టు కనిపిస్తోంది. మొత్తానికి యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇచ్చే ఉద్దేశంతోనే కిరణ్ ముందుకు వెళుతున్నాడు. ఏప్రిల్ 7వ తేదీన వచ్చే ‘మీటర్’తో కిరణ్ నెక్స్ట్ లెవెల్ కి వెళతాడేమో చూడాలి. ఈ సినిమాతో కథానాయికగా ‘అతుల్య రవి’ పరిచయమవుతున్న సంగతి తెలిసిందే.

Also Read : ఆ ఫైట్ సీన్ పూనకాలు తెప్పిస్తుంది: కిరణ్ అబ్బవరం 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular