Kisan Maha Panchayat On 22nd November In Lucknow :
కేంద్ర ప్రభుత్వానికి భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు రాకేశ్ తికాయిత్ అల్టిమేటం జారీ చేశారు. రైతు వ్యతిరేఖ చట్టాలను వెంటనే రద్దు చేయక పోతే రైతు ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్ లోని పూర్వాంచల్ లో ఉద్యమం మహోదృతంగా కొనసాగిస్తామని వెల్లడించారు. ఇందులో భాగంగా ఈ నెల 22వ తేదిన లక్నోలో రైతాంగంతో కిసాన్ మహా పంచాయత్ నిర్వహిస్తున్నామని చెప్పారు. చారిత్రాత్మకమైన ఈ కార్యక్రమంతో కేంద్రం పునాదులు కడులుతాయని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
లక్నో మహా పంచాయత్ ద్వారా రైతు ఉద్యమాన్ని పూర్వాంచల్ లో గ్రామ స్థాయికి తీసుకెళతామని రాకేశ్ తికాయిత్ వివరించారు. రైతు వ్యతిరేఖ చట్టాలని రద్దు చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిరసన తెలుపుతున్న రైతులను భయబ్రాంతులకు గురిచేస్తోందన్నారు. టెంట్లు తొలగిస్తూ అధికార యంత్రాంగం భయానక వాతావరణం సృస్తిస్తోందన్నారు. ప్రభుత్వ ధోరణిలో మార్పు రాకపోతే పోలీసు స్టేషన్లు, కలెక్టర్ కార్యాలయాల ముందు ఆందోళనలు చేపడతామని తెలిపారు.
Also Read :