Sunday, March 8, 2026
HomeTrending Newsకిషన్ రెడ్డికి పర్యాటకం, ఈశాన్యం

కిషన్ రెడ్డికి పర్యాటకం, ఈశాన్యం

క్యాబినెట్ మంత్రిగా పదోన్నతి పొందిన జి. కిషన్ రెడ్డికి పర్యాటకం, సాంస్కృతిక శాఖలతో పాటు అత్యంత కీలకపైన ఈశాన్య రాష్టాల అభివృద్ధి మంత్రిత్వ శాఖను కేటాయించారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని గుర్తించిన నాటి వాజపేయి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2001లో దీనికోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేసింది.

మోడీ-2 క్యాబినెట్ లో ఇప్పటివరకూ ఈ శాఖను జితేంద్ర సింగ్ స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రిగా నిర్వర్తించారు. పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రిగా ప్రహ్లాద్ సింగ్ జోషి కూడా స్వతంత్ర హోదాతో ఇప్పటివరకూ పనిచేశారు

జితేంద్ర సింగ్, ప్రహ్లాద్ జోషి లు నిర్వహించిన ఈ శాఖలను కిషన్ రెడ్డికి కేబినేట్ హోదా ఇచ్చి కేటాయించడం గమనార్హం. నేడు కిషన్ రెడ్డి ఆయా శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. సాయంత్రం జరిగే క్యాబినెట్ సమావేశంలో పాల్గొంటారు. కొత్త మంత్రులకు మరోసారి మోడీ భవిష్యత్ ప్రణాళికపై దిశా నిర్దేశం చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular