Thursday, March 28, 2024
HomeTrending Newsఅనురాగ్ కు ఐబి, రిజిజుకు న్యాయం

అనురాగ్ కు ఐబి, రిజిజుకు న్యాయం

కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళన అంతతరం మంత్రిత్వ శాఖల కేటాయింపు కూడా పూర్తి చేశారు. అమిత్ షా కు హోం శాఖతో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన సహకార శాఖను జత చేశారు. నాలుగు కీలక మంత్రిత్వ శాఖల్లో మార్పులు ఏమీ చేయలేదు. ఇప్పటివరకూ పెట్రోలియం, సహజ వనరుల మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రదాన్ ను విద్యా శాఖకు మార్చారు.

  • ప్రకాష్ జవ్ దేకర్ నిర్వహించిన అటవీ, పర్యావరణం, వాతావరణ మార్పులను భూపేంద్ర యాదవ్ కు….. సమాచార, ప్రసార శాఖను అనురాగ్ ఠాకూర్ కు కేటాయించారు. భూపేంద్రకు అదనంగా కార్మిక, ఉపాధి కల్పనా శాఖను కూడా అప్పగించారు.
  • రవిశంకర్ ప్రసాద్ నిర్వహించిన ఐటి, కమ్యూనికేషన్స్. ఎలక్ట్రానిక్స్ శాఖలను అశ్విని వైష్ణవ్ కు కేటాయించారు. అదనంగా రైల్వే శాఖను కూడా ఇచ్చారు. రవిశంకర్ ప్రసాద్ చూసిన మరో న్యాయ శాఖను కిరణ్ రిజిజుకు కేటాయించారు.
  • సదానంద గౌడ నిర్వహించిన ఎరువులు రసాయన శాఖను మన్సుఖ్ మాండవీయకు కేటాయించారు, హర్షవర్ధన్ చూసిన ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖను కూడా మన్సుఖ్ కే అప్పగించారు
  • హర్దీప్ సింగ్ పూరి కి అర్బన్ హౌసింగ్ తో పాటు కీలకమైన పెట్రోలియం, సహజ వనరుల శాఖను కేటాయించారు.
  • తావర్ చంద్ గెహ్లాట్ నిర్వహించిన సామాజిక న్యాయం, సాధికారత శాఖను డా. రవీంద్ర కుమార్ కు అప్పగించారు
  • పశుపతి పరాస్ కు ఆహార సంబంధ పరిశ్రమల శాఖను కేటాయించారు.
  • సర్బానంద సోనోవాల్ కు పోర్టులు, షిప్పింగ్, జల రవాణా, అయుష్
  • నారాయణ రాణేకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు
  • జ్యోతిరాదిత్య సింధియా కు పౌర విమానయానం
  • పురుషోత్తం రుపాలాకు మత్స్య, పశు సంవర్ధకం, డెయిరీ
  • కిషన్ రెడ్డికి పర్యాటకం, టూరిజం, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖలు కేటాయించారు
RELATED ARTICLES

Most Popular

న్యూస్