Friday, September 20, 2024
HomeTrending NewsBJP: ఇప్పుడే యుద్ధం ప్రారంభమైంది - కిషన్ రెడ్డి

BJP: ఇప్పుడే యుద్ధం ప్రారంభమైంది – కిషన్ రెడ్డి

పేదలకోసం గొప్పగా కట్టామని చెబుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను చూడడానికి వెళ్తుంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉలికిపాటెందుకు అని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఇదేమైనా ఉద్యమమా? లేక తిరుగుబాటా అన్నారు. రంగారెడ్డి జిల్లా బాటసింగారంలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించడానికి వెళ్తూ కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు పేరుతో బిజెపి నేతలను గత రాత్రి నుండి అరెస్టు చేయడం అక్రమమని, బిజెపి నాయకులను గృహనిర్బంధాలు చేయడం దుర్మార్గమైందని మండిపడ్డారు.

ఇప్పుడే యుద్ధం ప్రారంభమైంది. బీఆరెస్ ను గద్దెదించే వరకు ఈ ఉద్యమం ఆగదని కిషన్ రెడ్డి హెచ్చరించారు. హౌస్ అరెస్ట్ లు అక్రమ అరెస్టులు బీఆరెస్ ప్రభుత్వ నిరంకుశత్వనికి పరాకాష్ట అని గొప్పగా డబల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తే ఈ అక్రమ అరెస్టులెందుకు అని ప్రశ్నించారు. బీజేపీ నేతలను ముందస్తు అరెస్ట్ లు చేయడం గృహానిర్బంధం చేయడం దుర్మార్గం. 2ఏళ్ళల్లో ప్రగతి భవన్ నిర్మించుకున్న కేసీఆర్ 9 ఏళ్ళైన పేదల డబల్ బెడ్ రూమ్ ల నిర్మాణం మాత్రం జరగలేదంటే పేదలపట్ల బీఆరెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఏంటో అర్ధం అవుతుందన్నారు.

మరోవైపు గద్వాల పట్టణంలోని దౌదర్పల్లి దర్గా దగ్గర నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పరిశీలించారు. బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ ని హబ్సిగూడలో వారి నివాసంలో పోలీసులు అరెస్టు చేసి ఉస్మానియా పోలీస్ స్టేషన్ కు తరలించారు. బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు శాసనసభ్యులు ఈటల రాజేందర్ ని హౌస్ అరెస్ట్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్