Monday, June 15, 2026
Homeస్పోర్ట్స్PAK Vs. SL: నాలుగు వికెట్లతో పాక్ గెలుపు

PAK Vs. SL: నాలుగు వికెట్లతో పాక్ గెలుపు

శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో పాకిస్తాన్ నాలుగు వికెట్లతో విజయం సాధించింది.  విజయానికి 131 పరుగుల లక్ష్యంతో  రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన పాక్ నిన్న నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 48 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

ఇమామ్ ఉల్ హక్ అర్ధ సెంచరీ  (50)తో నాటౌట్ గా నిలవగా, కెప్టెన్ బాబర్ అజామ్-24; సౌద్ షకీల్ -30 పరుగులు చేసి ఔటయ్యారు.

తొలి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ చేసిన సౌద్ షకీల్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది.

రెండు టెస్టుల సిరీస్ లో పాక్ 1-0 తో ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్ట్ కొలంబో లోని సింహళీస్ స్పోర్ట్స్ మైదానంలో జూలై 24న మొదలు కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular