కోల్ కతా నైట్ రైడర్స్ 5 వికెట్లతో పంజాబ్ కింగ్స్ పై విజయం సాధించింది. ఆండ్రీ రస్సెల్ 19వ ఓవర్లో మూడు సిక్సర్లతో సత్తా చాటాడు. చివరి ఓవర్లో 6 పరుగులు కావాల్సిన దశలో తొలి బంతికి పరుగు రాలేదు. తర్వాతి రెండు బంతులకు రెండు సింగల్స్ వచ్చాయి. నాలుగో బంతికి రస్సెల్ రెండు పరుగులు సాధించి ఐదో బంతికి ఔటయ్యాడు. చివరి బంతికి 2 పరుగులు కావాల్సిన దశలో రింకూ సింగ్ ఫోర్ కొట్టి అపూర్వ విజయం అందించాడు.
కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. కెప్టెన్ శిఖర్ ధావన్-57; జితేష్ శర్మ-21; షారూఖ్ ఖాన్-21; రిషి ధావన్-19పరుగులు చేశారు. కోల్ కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3, హర్షిత్ రాణా 2; సుయాష్ శర్మ, నితీష్ రాణా చెరో వికెట్ పడగొట్టారు.
లక్ష్య ఛేదనలో నితీష్ రాణా – 51; జేసన్ రాయ్-42; రహమతుల్లా గుర్జాబ్-15; వెంకటేష్ అయ్యర్-11 పరుగులు చేశారు. ఆండ్రీ రస్సెల్- రింకూ సింగ్ లు ఐదో వికెట్ కు 4.3 ఓవర్లలో 54 పరుగులు జోడించి విజయంలో కీలకపాత్ర పోషించారు.
ఆండ్రీ రస్సెల్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.