Tuesday, June 9, 2026
Homeసినిమాకేఎల్ నారాయణ ఆవిష్కరించిన ‘దర్జా’ ఫస్ట్ లుక్

కేఎల్ నారాయణ ఆవిష్కరించిన ‘దర్జా’ ఫస్ట్ లుక్

Darjaa: కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌ రవి పైడిపాటి. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో నిర్మాత కేఎల్ నారాయణ ఆవిష్కరించారు. అనంతరం కె.ఎల్.నారాయ‌ణ‌ మాట్లాడుతూ “ఈ ఫస్ట్ లుక్ కూడా ‘దర్జా’గా ఉందని, ఈ సినిమా కూడా దర్జాగా ఆడి, అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను” అన్నారు.

ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ “ఫస్ట్ లుక్ ఆవిష్కరించి, ఆశీస్సులు అందించిన నిర్మాత కేఎల్ నారాయణ గారికి చిత్రయూనిట్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ వేడుకకు వచ్చి.. మమ్మల్ని బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. సినిమా చాలా బాగా వస్తోంది. హైదరాబాద్, భీమవరం, మచిలీపట్నంలోని అందమైన ప్రదేశాలలో షూటింగ్ చేశాం. కామినేని శ్రీనివాస్ గారి సపోర్ట్ మరిచిపోలేనిది. అనసూయ తండ్రి చనిపోయిన బాధలో ఉండి కూడా మా షూటింగ్ లో పాల్గొని మాకు సహకరించిన తీరు ఎప్పటికీ మరువలేనిది. అలాగే ఇతర నటీనటులు కూడా ఎంతగానో సపోర్ట్ అందిస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాం” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular