Sunday, January 19, 2025
HomeTrending Newsప్రభుత్వంపై టిడిపి విషప్రచారం : నాని

ప్రభుత్వంపై టిడిపి విషప్రచారం : నాని

ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ప్రతి రోజూ ఏదో ఒక కుట్ర చేస్తోందని మాజీ మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోరంట్ల మాధవ్ విషయంలో ఒక ఫేక్ ఫోరెన్సిక్ రిపోర్ట్ ను తీసుకొచ్చి విషప్రచారం చేశారని, మహిళలను అడ్డం పెట్టుకొని టిడిపి రాజకీయాలు చేస్తోందని నాని విమర్శించారు. రోజూ ఇదే అంశంపై విమర్శలు చేస్తూ, టివీల్లో వీడియో పదే పదే ప్రచారం చేస్తూ అసలు టివి పెట్టాలంటేనే అసహ్యం కలిగేలా ప్రవర్తిస్తున్నారని నాని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ఈ విషయంలో వాస్తవాలు గ్రహించాలని, మహిళలు టిడిపికి బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు.

ఢిల్లీలో ప్రధాని మోడీతో చంద్రబాబు సమావేశాన్ని ఇక్కడి మీడియా గోరంతలు చేసి చూపించారని, కానీ మోడీని బాబు ప్రాధేయ పడ్డారని నాని సంచలన ఆరోపణ చేశారు. ‘కొందరు వ్యక్తులు తనను పక్కదోవ పట్టించారని… అందుకే తాను మీపై వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేశానని… తనను క్షమించమని’ ఐదుసార్లు మోడీని బాబు వేడుకున్నారని నాని వెల్లడించారు. బాబు ఐరన్ లెగ్ అని, ఆయన మోడీకి షేక్ హ్యాండ్ ఇవ్వగానే బీహార్ లో నితీష్ కుమార్ ఎన్డీయే నుంచి బైటికి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు.  బాబు గతంలో ఢిల్లీ వెళ్లి సోనియా, రాహుల్ ను కలిసి వచ్చారని.. చివరకు వారిద్దరూ అసలు ఆ పార్టీ సారధ్యం వహించాదానికే భయపడుతున్నారని నాని వ్యాఖ్యానించారు.

 

Also Read: ఆ పేరు వింటేనే భయం: నాని

RELATED ARTICLES

Most Popular

న్యూస్