Saturday, January 18, 2025
HomeTrending Newsచంద్రబాబు కొత్త పార్టీ: కొడాలి సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబు కొత్త పార్టీ: కొడాలి సంచలన వ్యాఖ్యలు

మాజీ ముఖ్యమంత్రి  చంద్రబాబునాయుడు త్వరలో కొత్త పార్టీ పెట్టుకోబోతున్నారని మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ సారధ్య బాధ్యతలు త్వరలో జూనియర్ ఎన్టీఆర్ తీసుకుంటారని, ఆ తర్వాత బిజెపి-టిడిపి కలిసి పోటీ చేస్తాయని ఇది 2024 ఎన్నికల్లోనే జరగబోతుందని జోస్యం చెప్పారు. లక్ష్మీ పార్వతి అడిగారనో, తాను అడిగాననో జూనియర్ రాజకీయాల్లోకి రారని, సరైన సమయంలో వస్తారని స్పష్టం చేశారు.

చంద్రబాబు కొత్త పార్టీ పెట్టుకొని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో కలిసి పోటీ చేస్తారని చెప్పారు. జనసేన-టిడిపి లకు డిపాజిట్లు కూడా రావని, 2024 తర్వాత ఈ రెండు పార్టీలూ కనుమరుగవుతాయని అన్నారు. తాము ఒంటరిగా పోటీ చేసి రెండు కూటములను నేలమట్టం చేసి తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.  బాబు, పవన్ పార్టీలు  రాజకీయంగా కాకా వికలమై పోతాయని చెప్పారు.

Also Read : ముద్రగడ విషయంలో ఏమైంది: కొడాలి 

RELATED ARTICLES

Most Popular

న్యూస్