Mini Review: విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ ‘లైగర్‘ సినిమాను రూపొందించాడు. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ కథలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపిస్తాడు. అనన్య పాండే కథానాయికగా నటించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ .. రోనిత్ రాయ్ .. చుంకీ పాండే ముఖ్యమైన పాత్రలను పోషించారు. ప్రత్యేకమైన పాత్రలో మైక్  టైసన్ కనిపిస్తాడు.కరణ్ జొహార్ తో కలిసి పూరి నిర్మించిన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా, ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుందనేది ఆసక్తికరమైన అంశంగా మారింది.

ఓ సాధారణమైన కుటుంబానికి చెందిన కరీంనగర్ కుర్రాడు, బాక్సర్ కావాలనే పట్టుదలతో తల్లితో కలిసి ముంబై చేరుకుంటాడు. తనకి ఉన్న ‘నత్తి’ని హైలైట్ చేస్తూ అందరూ అవహేళన చేస్తున్నా, తాను అనుకున్న మార్గంలో ముందుకు వెళ్లడానికి ఆయన ట్రై చేస్తుంటాడు. తన శత్రువు చెల్లెలని ప్రేమించి, ఆమె కోసం ప్రాణాలకు కూడా తెగిస్తాడు. కానీ ఆమె కూడా తనని అవమానించడాన్ని  తట్టుకోలేకపోతాడు. అవమానాలను దాటుకుని ఆశయం దిశగా అతను ఎలా సాగిపోయాడనేదే ఈ సినిమా కథ.

ఇది కొత్త కథేం కాదు .. తన స్టైల్లో పూరి చెప్పడానికి  ట్రై చేసిన కథ. బాక్సింగ్ ప్రధానమైన కథే అయినప్పటికీ, పూరి కథను ఎత్తుకున్న తీరు బాగుంది. ఫస్టాఫ్ అంతా కూడా లవ్ ట్రాక్ తో కలిసే హీరో ప్రయాణం సాగుతుంది. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీని కలుపుకుని ఫస్టాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది. సెకండాఫ్ మొదలైన తరువాత ప్రీ క్లైమాక్స్ నుంచి కథ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లాలి. ఇక్కడే కథ దారి తప్పేసింది. లాస్ వేగాస్ లో చుంకీ పాండే ఎంట్రీ ఇచ్చిన తరువాత ఒక ట్విస్ట్ ఉంటుంది. అక్కడి నుంచి కథ పట్టును కోల్పోయి తనకి తోచిన దిశగా పరిగెడుతుంది.

ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఇంటర్వ్యూలోను మైక్ టైసన్ ను గురించి చెప్పారు. ఆయన నటించిన తొలి ఇండియన్ సినిమా ఇది. అంతవరకూ ఈ సినిమా ప్రత్యేకతను సంతరించుకున్నప్పటికీ, ఆ పాత్ర ఎంట్రీ .. అక్కడి నుంచి నడిచిన కథ బలహీనంగా అనిపిస్తాయి. ఇక్కడ సెట్ చేసుకుని ఉంటే సినిమా నెక్స్ట్ రేంజ్ కి వెళ్లిపోయేదే. ఇక హీరోకి ‘నత్తి’ పెట్టడం వలన పూరి మార్క్ డైలాగ్స్ ను ఆడియన్స్ మిస్సయ్యారు. ఈ సినిమాకి విజయ్ దేవరకొండ .. రమ్యకృష్ణ పాత్రలు ప్రధానమైన బలంగా నిలిచాయి. అనన్య ఆకర్షణీయంగా మెరిసింది. సంగీతం .. ఫొటోగ్రఫీ అదనపు బలంగా నిలబడ్డాయి. ఓపెనింగ్స్  ఒక రేంజ్ లో ఉంటాయనడంలో సందేహం లేదు. వీకెండ్ తరువాత పరిస్థితి ఎలా ఉంటుందనేదే చూడాలి.

Also Read : లైగర్ మనది దేశానికి చూపిస్తున్నాం : విజయ్ దేవరకొండ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *