Sunday, February 23, 2025
HomeTrending Newsలోకేష్.. పిచ్చివాగుడు మానుకో : నాని

లోకేష్.. పిచ్చివాగుడు మానుకో : నాని

Kodali Nani Warned Nara Lokesh For His Comments On Ys Jagan :

లోకేష్ కు దమ్ముంటే సిఎం ఇంటిని ముట్టడించాలని పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) సవాల్ విసిరారు. ‘లోకేష్… దమ్ముంటే రా… చంద్రబాబు కొడుకువైతే రా, ముఖ్యమంత్రి గారి గుమ్మాన్ని వచ్చి ముట్టుకో. తోలు వలిచి చెప్పులు కుట్టిస్తాం’ అని తీవ్రంగా స్పందించారు. అనంతపురం వెళ్ళి నారా లోకేష్‌ పిచ్చి పిచ్చిగా మాట్లాడారని, పదేపదే ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. ఇలానే నోరు అదుపులో పెట్టుకోకుండా మాట్లాడితే లోకేష్‌, చంద్రబాబులకు తగిన శాస్తి జరుగుతుందని నాని హెచ్చరించారు.  తాత ముఖ్యమంత్రి, తండ్రి ముఖ్యమంత్రి అయినా ఎమ్మెల్యేగా కూడా గెలవలేని లోకేష్ అధికారంలోకి వస్తాడా? అని నాని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత మీ సంగతి తేలుస్తానంటూ మంత్రులు, అధికారులను లోకేష్ బెదిరించడాన్ని, కొడుకుల్లారా అంటూ మాట్లాడడాన్ని నాని ఖండించారు.

విద్యార్థుల బంగారు భవిష్యత్తుకోసం సీఎం జగన్ ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని, విలీనంపై ఎలాంటి బలవంతం లేదని, స్వచ్ఛందమేనని ఈ విషయాన్ని సిఎం, మంత్రులు ఎన్నోసార్లు స్పష్టంగా చెప్పారని నాని గుర్తు చేశారు. ఎయిడెడ్‌ జీవోను వెనక్కి తీసుకునే పరిస్థితి లేదని, చంద్రబాబులా పొద్దున్న జీవోలు ఇవ్వడం మధ్యాహ్నానికి క్యాన్సిల్‌ చేసుకోవడం, సాయంత్రానికి ఒకమాట చెప్పడం, తెల్లారేపాటికో మాట మార్చడం జగన్‌గారి రక్తంలో లేదని నాని స్పష్టం చేశారు. ఎయిడెడ్‌ విద్యాసంస్థలను యాజమాన్యం నడుపుకోవాలనుకుంటే యథావిధిగా నడుపుకోవచ్చని, ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పామని, అయితే మౌలిక వసతులతో పాటు, టీచింగ్‌ స్టాఫ్‌ లేకున్నట్లయితే ప్రభుత్వానికి అప్పగిస్తే వాటిని తీసుకుని, ప్రభుత్వమే నడిపిస్తుందని ఆ జీవోలో చెప్పడం జరిగిందని నాని వివరించారు.

జగన్  ముఖ్యమంత్రి అయ్యాక 45 వేల పాఠశాలల్లో 15వేల పాఠశాలలను రూ 3,600 కోట్లు పెట్టి నాడు-నేడు కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేశారని, చంద్రబాబు హయాంలో నాలుగు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలు వదిలేసి వెళ్లిపోయారని, తాము అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే ఆరు నుంచి ఎనిమిది లక్షలమంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరి చదువుకుంటున్నారని వెల్లడించారు.  జగనన్న అమలు చేస్తున్న అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, గోరుముద్ద తదితర పథకాలతోపాటు ప్రభుత్వ స్కూళ్ళలో లభిస్తున్న నాణ్యమైన విద్యతో పాటు మౌలిక సదుపాయాలు కూడా దీనికి కారణమని నాని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలోని విద్యార్థులందర్నీ తమ సొంత పిల్లలుగా చూస్తూ, వారి అభ్యున్నతికి, వారి బంగారు భవిష్యత్తుకు పాటు పడుతున్నారని నాని ప్రశంసించారు.

Also Read : ఎయిడెడ్ ఉద్యమం అన్ స్టాపబుల్: లోకేష్

RELATED ARTICLES

Most Popular

న్యూస్