Friday, March 13, 2026
Homeస్పోర్ట్స్IPL: కీలక మ్యాచ్ లో కోల్ కతా గెలుపు

IPL: కీలక మ్యాచ్ లో కోల్ కతా గెలుపు

కెప్టెన్ నితీష్ రాణా, రింకూ సింగ్ అర్ధ సెంచరీలతో కదం తొక్కడంతో చెన్నై సూపర్ కింగ్స్ పై 6 వికెట్ల తేడాతో కోల్ కతా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించింది. చెన్నై చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ధోనీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. జట్టులో శివమ్ దూబే-48; డెవాన్ కాన్వే-30; రవీంద్ర జడేజా-20; రుతురాజ్ గైక్వాడ్-17; అజింక్యా రెహానే-16 పరుగులతో రాణించారు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 144 పరుగులే చేయగలిగింది.

కోల్ కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ చెరో రెండు, వైభవ్ అరోరా, శార్దూల్ ఠాకూర్ చెరో వికెట్ పడగొట్టారు.

లక్ష్యం స్వల్పమే అయినా కోల్ కతా 33 పరుగులకే మూడు కీలక వికెట్లు (రహ్మతుల్లా గుర్జాబ్-; వెంకటేష్ అయ్యర్-; జేసన్ రాయ్-) కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ రాణా- రింకూలు క్రీజులో నిలదొక్కుకొని జట్టును విజయం దిశగా నడిపించారు. 43 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 రన్స్ చేసి 18వ ఓవర్లో రనౌట్ గా వెనుదిరగ్గా.. రాణా 44 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్ తో 57 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.

చెన్నై బౌలర్లలో రాహుల్ చాహర్ మూడు వికెట్లు సాధించాడు.

ఈ గెలుపుతో ప్లే ఆఫ్స్ అవకాశాలను కోల్ కతా సజీవంగా ఉంచుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular