Saturday, March 14, 2026
Homeస్పోర్ట్స్IPL: సొంత గడ్డపై హైదరాబాద్ మరో సారీ

IPL: సొంత గడ్డపై హైదరాబాద్ మరో సారీ

సొంతగడ్డపై  సన్ రైజర్స్ హైదరాబాద్ కు మరోసారి పరాభవం ఎదురైంది. నేడు జరిగిన మ్యాచ్ లో  కోల్ కతా  నైట్ రైడర్స్ ఐదు పరుగులు తేడాతో హైదరాబాద్ పై విజయ సాధించింది.  ఉప్పల్ లో  జరిగిన ఈ మ్యాచ్ లో కోల్ కతా  టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రింకూ సింగ్ -46; కెప్టెన్ నితీష్ రాణా-42, ఆండ్రీ రస్సెల్ రసూల్ 24, జేసన్ రాయ్-20 పరుగులతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల కోల్పోయి 171 పరుగులు చేసింది.

హైదరాబాద్ బౌలర్లలో  మార్కో జేన్సన్, నటరాజన్ చెరో రెండు; భువనేశ్వర్, కార్తీక్ త్యాగి, మార్కండే, మార్ క్రమ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

హైదరాబాద్ 54 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. మయాంక్ అగర్వాల్-18, రాహుల్ త్రిపాఠి-20 రన్స్ చేయగా… అభిషేక్ శర్మ-9, హ్యారీ బ్రూక్ (డకౌట్) విఫలమయ్యారు.  కెప్టెన్ ఏడెన్ మార్ క్రమ్- 41, హెన్రిచ్ – 36 పరుగులతో రాణించారు, చివర్లో అబ్దుల్ సమద్ 21 పరుగులు చేసి గెలుపుపై ఆశలు రేకెత్తించినా  చివరి ఓవర్లో 9 పరుగులు కవాల్సిన దశలో మూడో బంతికి సమద్ ఔట్ కావడంతో హైదరాబాద్ కు నిరాశ తప్పలేదు. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 166 పరుగులే చేయగలిగింది.

కోల్ కతా బౌలర్లలో వైభవ్ అరోరా, శార్దూల్ ఠాకూర్ చెరో రెండు; హర్షిత్ రాణా, ఆండ్రీ రస్సెల్, అనుకూల్ రాయ్, వరుణ్ చక్రవర్తి తలా ఒక వికెట్ సాధించారు. కట్టుదిట్టంగా బౌలింగ్ వరుణ్ చక్రవర్తికి ప్లేయర్ అఫ్ ద మ్యాచ్   లభించింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular