కేసీఆర్ అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ పొగుడుతూ బిజెపినీ తిట్టారని…అదంతా రాజకీయ ఎత్తుగడ అని కాంగ్రెస్ నేత, ఎంపి కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు. సీఎం కాంగ్రెస్ ను పొగడాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణలో వచ్చేది హాంగ్ అసెంబ్లీ అని కోమటి రెడ్డి ఢిల్లీలో ఈ రోజు అన్నారు. భువనగిరి, నల్గొండలో వివిధ రైళ్ళ హాల్ట్ కోసం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరికి విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి రాష్ట్ర రాజకీయాలపై స్పందించారు. ఎవరికి 60 సీట్లు రావని, కాంగ్రెస్ -బిఅర్ఎస్ లు సెక్యులర్ పార్టీలన్నారు. కాంగ్రెస్ సిద్దాంతాల దృష్ట్యా బిజెపితో కలిసే పరిస్థితి లేదని చెప్పారు. కొన్ని కారణాల వల్ల ఇంకా మా నేతలు ఒక్క వేదిక పైకి రావడం లేదని ఇది పార్టీకి మేలు చేసే పని కాదన్నారు. కాంగ్రెస్ లో అందరూ కలిసి కష్ట పడితే 40 సీట్లు వస్తాయని, ఒక్కరు గెలిపిస్తా అంటే కాని పని అని ఎంపి కోమటి రెడ్డి అన్నారు.

తెలంగాణలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే అని కాంగ్రెస్ నేత, ఎంపి కోమటిరెడ్డి వెంకట రెడ్డి జోస్యం చెప్పారు. పార్టీ గెలుపు కోసం నా వంతుగా కృషి చేస్తానని చెప్పారు. త్వరలోనే నేను కూడా పాదయాత్ర చేపడతానని.. మోటార్ సైకిల్ యాత్ర చేపట్టే ఆలోచన ఉందని కోమటిరెడ్డి వెల్లడించారు. పాదయాత్రకు సంబంధించి త్వరలోనే పార్టీ అధిష్టానం నుంచి అనుమతి తీసుకుంటానని పేర్కొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు జాతీయ రహదారుల మీద కాకుండా గ్రామాల మీదుగా సాగితే బాగుంటుంది అన్నారు. కాంగ్రెస్ రాష్ట్రా వ్యవహారాల ఇంచార్జ్ గా ఉన్న మాణిక్ టాగోర్ మేము ఏదైనా విషయం చెపితే ఆయన సెల్ ఫోన్ చూడటం తప్పితే మా మాటలు వినటం లేదని ఆరోపించారు. ఇప్పుడు వచ్చిన మాణిక్ రావు థాకరే అందరితే కలుపుగోలుగా ఉంటారని, కార్యకర్తల నుంచి నేతల వరకు అందరిని కలుపుకు పోయే మనస్తత్వం అన్నారు. గెలిచే వాళ్లకు టికెట్స్ ఇవ్వాలని…ఎవరి వర్గం వాళ్లకు వారు పార్టీ టికెట్స్ ఇస్తే పార్టీ గెలుపు ఇబ్బంది అవుతుంది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి దిగుతుందని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తేల్చి చెప్పారు. పొత్తులు ఉంటె బిజెపికే లాభం అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *