Tuesday, January 21, 2025
Homeసినిమాబాల‌య్య‌తో మూవీ ప్లాన్ చేస్తున్న‌ కొర‌టాల‌?

బాల‌య్య‌తో మూవీ ప్లాన్ చేస్తున్న‌ కొర‌టాల‌?

Koratala To Direct Balayya Soon :

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టించిన ‘అఖండ’ డిసెంబ‌ర్ 2న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. అఖండ త‌ర్వాత బాల‌య్య ‘క్రాక్’ తో స‌క్సెస్ సాధించిన మ‌లినేని గోపీచంద్ తో సినిమా చేయ‌నున్నారు. ఈ భారీ చిత్రాన్ని ఇటీవ‌ల సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో గ్రాండ్ గా ప్రారంభించారు. జ‌న‌వ‌రి నుంచి ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ చేయ‌నున్నారు. అయితే… స్పీడు మీదున్న బాల‌య్య బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో సినిమా చేయ‌నున్న‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

మెగాస్టార్ చిరంజీవితో కొర‌టాల తెర‌కెక్కించిన ‘ఆచార్య’ ఫిబ్ర‌వ‌రి 4న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా త‌ర్వాత యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో కొరటాల సినిమా చేయ‌నున్నారు. ఆ త‌ర్వాత బాల‌య్య‌తో కొర‌టాల మూవీ ఉంటుంద‌ని టాలీవుడ్ లో గ‌ట్టిగా టాక్ వినిపిస్తోంది. నిజానికి బాలయ్య కొరటాల కాంబినేష‌న్ ఎప్పుడో ఫిక్స్ అవాలి. జనతా గ్యారేజ్ మూవీలో మోహన్ లాల్ పాత్రలో మొదట బాలయ్యనే అడిగారని కానీ.. ఎందుకో కుదరలేద‌ని టాక్ వినిపించింది.

ఇప్పుడు బాలయ్య కోసం కొర‌టాల‌ పక్కా మాస్ సబ్జెక్ట్ ని రెడీ చేశార‌ని, ఆల్రెడీ బాల‌య్య‌కు కథ చెప్ప‌డం.. ఆయ‌న ఓకే అన‌డం కూడా జ‌రిగింద‌ని తెలిసింది. ఇదే క‌నుక నిజ‌మైతే.. బాల‌య్య అభిమానుల‌కు పండ‌గే.

Also Read :  ‘అఖండ’ ట్రైలర్ అదిరింది

RELATED ARTICLES

Most Popular

న్యూస్