Sunday, January 19, 2025
HomeTrending Newsచైనాలో భారీగా కరోనా కేసులు

చైనాలో భారీగా కరోనా కేసులు

చైనాలో కరోనా కేసులు మళ్ళీ వ్యాపిస్తున్నాయి. మహమ్మారి విజృంభణతో వైరస్‌బారిన పడుతున్న వారిసంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. గురువారం రికార్డు స్థాయిలో 31 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదవగా, నేడు 32,695 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. ఇందులో 3041 మందికి కరోనా లక్షణాలు ఉండగా, 29,654 మందికి ఎలాంటి లక్షణాలు లేవని అధికారులు తెలిపారు. దీంతో వైరస్‌ విజృంభణను నిలువరించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఎక్కువ కేసులు నమోదవుతున్న పట్టణాల్లో లాక్‌డౌన్లు విధిస్తున్నారు.

తాజాగా రికార్డయిన పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా గ్వాంగ్‌జౌ, ఛోంగ్‌క్వింగ్‌ పట్టణాల్లో ఉన్నాయి. ఛెంగ్డూ, జినాన్‌, లాన్‌జౌ, గ్జినా, వుహాన్‌ పట్టణాల్లో కూడా భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆయ పట్టణాల్లో ప్రజలు అత్యవసరమైతే తప్ప తమ ఇండ్ల నుంచి బయటకు రాకూడని అధికారులు ఆదేశాలు జారీచేశారు.

ఏప్రిల్‌ నెలలో షాంఘైలో భారీగా కరోనా కేసులు వెలుగు చూసిన విషయం తెలిసిందే. దీంతో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడానికి జీరో కోవిడ్‌ విధానంలో భాగంగా రెండు నెలల పాటు కఠింగా ఆంక్షలు అమలు చేశారు. అయితే అక్కడ వైరస్‌ను నిలువరించినప్పటికీ.. ఇతర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూ వస్తున్నాయి. దీంతో కరోనా పుట్టినిళ్లయిన చైనాలో రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్