Monday, June 8, 2026
Homeసినిమాక్రిష్ చేతుల మీదుగా 'రణస్థలి' ఫస్ట్ లుక్

క్రిష్ చేతుల మీదుగా ‘రణస్థలి’ ఫస్ట్ లుక్

Ranasthali:  సురెడ్డి విష్ణు సమర్పణలో ఏ.జె ప్రొడక్షన్ పతాకంపై ధర్మ, ప్రశాంత్, శివ జామి ,నాగేంద్ర , విజయ్ రాగం నటీనటులుగా నటించిన చిత్రం రణస్థలి. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి రిలీజ్ చేయటం జరిగింది. హీరో నాగశౌర్య నటించిన “అశ్వథ్థామ”సినిమాకి మాటల రచయితగా పని చేసిన పరుశరాం శ్రీనివాస్ దర్శకత్వంలో సురెడ్డి విష్ణు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది. ఈ చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టుడియోస్‌ లో ప్రముఖ దర్శకుడు జాగర్లమూడి క్రిష్ చేతుల మీదుగా “రణస్థలి” చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్  విడుదలైంది.

క్రిష్  మాట్లాడుతూ.. “రణస్థలి” సినిమా రఫ్ కట్ టీజర్ చూస్తుంటే.. టైటిల్ కు తగ్గట్టుగా సినిమా టీజర్ అద్భుతంగా ఉంది.  చిన్న సినిమాలో ఇలాంటి ఫైట్ సీక్వెన్స్ హ్యాండిల్ చేయడం మాములు విషయం కాదు. ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకునే ఈ టీం తపన నాకు  చాలా నచ్చింది. డైలాగ్స్ వింటుంటే కేజీఎఫ్ లెవెల్ లో ఇంపాక్ట్ ఇస్తున్నాయి. టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను”  అన్నారు.

దర్శకుడు పరశురామ్ శ్రీనివాస్ మాట్లాడుతూ “మా  రణస్థలి చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన దర్శకుడు క్రిష్ గారికి ధన్యవాదాలు.  క్యారెక్టర్ కనిపిస్తుంది తప్ప ఆర్టిస్టులు కనిపించరు. సినిమా చూసి బయటికి వచ్చిన తరువాత వారి పాత్రలు మనతోనే ఉంటాయి.  ప్రేక్షకులకు చిన్న సినిమా పై వుండే చులకన భావం పోయేలా మా సినిమా ఉంటుందని కచ్చితంగా చెప్పగలను. సంగీత దర్శకుడు మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఇలాంటి మంచి చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం కల్పించిన  సురెడ్డి విష్ణుకు ధన్యవాదాలు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న‌ ఈ చిత్రాన్ని ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా” అన్నారు.

Also Read : చ‌ర‌ణ్ పాత్ర ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసుంటే?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular