Wednesday, June 17, 2026
HomeసినిమాKris Out: 'వీరమల్లు' నుంచి క్రిష్‌ తప్పుకుంటున్నాడా?

Kris Out: ‘వీరమల్లు’ నుంచి క్రిష్‌ తప్పుకుంటున్నాడా?

పవన్ కళ్యాణ్‌, విభిన్న కథా చిత్రాల దర్శకుడు క్రిష్‌ కాంబినేషన్లో రూపొందుతున్న పీరియాడిక్ ఫిల్మ్ ‘హరి హర వీరమల్లు’. ఈ చిత్రాన్ని ఏ ముహుర్తాన ప్రారంభించారో కానీ.. అస్సలు ముందుకు వెళ్లడం లేదు. ఈ సినిమా కంటే వెనకాల స్టార్ట్ చేసిన సినిమాలకు డేట్స్ ఇస్తున్నాడు కానీ.. పవన్ ఎందుకనో వీరమల్లు అంటే ఇంట్రస్ట్ చూపించడం లేదని ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్. సంవత్సరానికి రెండు సినిమాలు చేసే క్రిష్‌ గత రెండు సంవత్సరాల నుంచి వీరమల్లుతో సతమతమౌతున్నాడు. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఏ.ఎం.రత్నం ప్రాజెక్ట్ ఆలస్యం అవ్వడం వలన వడ్డీలు బాగా పెరిగిపోవడం.. దీంతో బడ్జెట్ అంచనాలను దాటేయడంతో ఏమీ చేయలో తెలియక టెన్షన్ పడుతున్నారు.

తాజా వార్త ఏంటంటే.. దర్శకుడు క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలనుకుంటున్నాడట. ఇప్పటి వరకు సగం షూటింగ్ పూర్తయ్యింది. ఎంతో ప్రేమించి రాసుకున్న కథ ఇది. అందుచేత ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోలేడు కానీ.. పవన్ ఎంతకీ డేట్స్ ఇవ్వకపోవడంతో ఇక ఈ సినిమాని ప్రస్తుతానికి పక్కనపెట్టి మరో సినిమా చేస్తాడట. మరో న్యూస్ ఏంటంటే.. పూర్తిగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుని.. మిగిలిన షూటింగ్ ను వేరే డైరెక్టర్ తో చేయించుకోమని హీరో పవన్, నిర్మాత ఏఎం రత్నంకు చెబుతాడనే  కూడా వినిపిస్తుంది.

అలాగే పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు బల్క్ డేట్స్ ఎప్పుడు ఇస్తారో క్లారిటీగా చెబితే అంత వరకు వెయిట్ చేస్తాను. ఈలోపు మరో సినిమా చేసుకుంటానని కూడా అంటున్నాడట. పవన్ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, బ్రో చిత్రాలకు డేట్స్ ఇస్తున్నాడు కానీ.. వీరమల్లు చిత్రానికి మాత్రం డేట్స్ ఇవ్వడం లేదు. దీంతో క్రిష్ తెగ టెన్షన్ పడుతున్నాడట. ఇలా వార్తలు రావడంతో ఇండస్ట్రీలో వీరమల్లు హాట్ టాపిక్ అయ్యింది. మరి.. వీరమల్లు.. ఎప్పటికి క్రిష్ పై కరుణిస్తాడో.. ఎప్పుడు వరమిస్తాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular