Thursday, March 19, 2026
Homeసినిమా‘పరమహంస’గా రెబల్ స్టార్ కృష్ణంరాజు ఫస్ట్ లుక్ విడుదల

‘పరమహంస’గా రెబల్ స్టార్ కృష్ణంరాజు ఫస్ట్ లుక్ విడుదల

Rebel Star as Paramahamsa:
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇటు సౌత్.. అటు నార్త్ ప్రేక్షకులు రెండు చోట్లా సినిమా పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన రాధే శ్యామ్ పాటలన్నింటికీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాను మరో అప్ డేట్ బయటికి వచ్చింది. రాధే శ్యామ్ సినిమా నుంచి లెజెండరీ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు పోషిస్తున్న పరమహంస లుక్ విడుదలైంది. ఆధ్యాత్మికంగా ఉన్న ఆయన లుక్‌కు మంచి స్పందన వస్తుంది.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 23న ఆర్ఎఫ్‌సీలో జరగనుంది. పూర్తిగా కోవిడ్ నిబంధనలు పాటించి ఈ వేడుక జరుగనుంది. అక్కడికి వచ్చిన అభిమానులు అతిథులు నిబంధనలకు కట్టుబడి రావాలి అంటూ చిత్ర యూనిట్ తెలిపారు. అదే రోజు 5 భాషలకు సంబంధించిన ట్రైలర్ విడుదల కానుంది. అంతే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు అక్కడికి రానున్నారు. వాళ్ళ చేతుల మీదుగానే ట్రైలర్ విడుదల కానుంది. ప్రభాస్ లాంటి పాన్ ఇండియన్ హీరో.. తన సినిమా ట్రైలర్ అభిమానులతో విడుదల చేయించడం నిజంగా గొప్ప విషయం.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఒకేసారి ఒక సినిమాకు రెండు భాషల్లో వేర్వేరు సంగీత దర్శకులు పని చేయడం ఇదే తొలిసారి. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ.. కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. యువి క్రియేష‌న్స్ ప్రొడక్షన్స్ వాల్యూస్ చాలా ఉన్నతంగా ఉన్నాయి. ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ ర‌వీంద‌ర్ చాలా మంచి ప్లానింగ్‌తో డిజైన్ చేశారు. ఈ భారీ పీరియాడిక్ మూవీని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్నారు.

Also Read : డిసెంబర్ 23న ‘రాధే శ్యామ్’ ప్రీ రిలీజ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular