Monday, June 8, 2026
Homeసినిమాడిసెంబర్ 23న ‘రాధే శ్యామ్’ ప్రీ రిలీజ్

డిసెంబర్ 23న ‘రాధే శ్యామ్’ ప్రీ రిలీజ్

Fans are Guests for Radhe shyam event:
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అభిమానులకు సరికొత్త సినిమాటిక్ ఫీల్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు చిత్ర ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. ఇటు సౌత్.. అటు నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా అత్యున్నత సంగీత దర్శకులతో పాటలు సిద్ధం చేయిస్తున్నారు రాధే శ్యామ్ టీం. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తైపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ వ‌ర్క్ జ‌రుగుతుంది.

ఇప్పటి వరకు విడుదలైన రాధే శ్యామ్ పాటలన్నింటికీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా వచ్చిన సంచారి సాంగ్ టీజర్ కూడా అదిరిపోయింది. జస్టిన్ ప్రభాకరన్ అద్భుతమైన సంగీతం అందించారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ సాంగ్ టీజర్ వైరల్ అవుతుంది. పూర్తి పాట డిసెంబర్ 16న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్‌డేట్ బయటికి వచ్చింది. అది ఏంటంటే… డిసెంబర్ 23న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. అభిమానులే అతిథులుగా ఈ పాన్ ఇండియన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.

ఈ కార్యక్రమం రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. పూర్తిగా కోవిడ్ నిబంధనలు పాటించి ఈ వేడుక జరుగనుంది. అక్కడికి వచ్చిన అభిమానులు, అతిథులు నిబంధనలకు కట్టుబడి రావాలి అంటూ చిత్ర యూనిట్ తెలిపారు. అదే రోజు 5 భాషలకు సంబంధించిన ట్రైలర్ విడుదల కానుంది. అంతే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు అక్కడికి రానున్నారు. వాళ్ళ చేతుల మీదుగానే ట్రైలర్ విడుదల కానుంది. ప్రభాస్ లాంటి పాన్ ఇండియన్ హీరో.. తన సినిమా ట్రైలర్ అభిమానులతో విడుదల చేయించడం నిజంగా గొప్ప విషయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular