Sunday, April 13, 2025
HomeTrending Newsమొదటి రోజు మూడు లక్షల ప్యాకెట్లు: ఆనందయ్య

మొదటి రోజు మూడు లక్షల ప్యాకెట్లు: ఆనందయ్య

తాను పుట్టింది కృష్ణపట్నంలో కాబట్టి మొదట ఇక్కడ, తర్వాత సర్వేపల్లి నియోజకవర్గంలో ఇంటింటికీ మందు పంచుతున్నామని కరోనా మందు రూపకర్త ఆనందయ్య వెల్లడించారు. తయారు చేసిన పాకెట్లను ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి కి అందించామని, అయన వాలంటీర్ల ద్వారా పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారని ఆనందయ్య వివరించారు.

ప్రతి జిల్లాలో కోవిడ్ తో బాధపడే రోగులకు మొదట పంచాలని అనుకుంటున్నామని, దీనికి సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాలకోసం ఎదురుచూస్తున్నామని, ప్రభుత్వం సూచనల మేరకు తయారీ, పంపిణీపై ముందుకు వెళతామని చెప్పారు.  ఆన్ లైన్ పంపిణీకి సమయం పడుతుందని స్పష్టం చేశారు. మందు తయారీకి కావాల్సిన ముడి సరుకులు, ద్రవ్యాలు  త్వరలోనే సమకూరతాయని, వాటివల్ల తయారీకి ఎలాంటి సమస్యా ఉండబోదని అనుకుంటున్నట్లు ఆనందయ్య వివరించారు.

ఆనందయ్య మందు పంపిణీ నేడు ప్రారంభమైంది. తొలి విడతలో మూడు లక్షల పాకెట్లు సిద్ధం చేశారు. వీటిని తొలుత సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రామ వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయనున్నారు. క్రిష్ణపట్నంలోని సివీఆర్ అకాడెమీలో మందు తయారు చేశారు. వివాదాలు తలెత్తిన నేపథ్యంలో ఆన్ లైన్ ద్వారా మందు పంపిణీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్